ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైతులకు రూ.256 కోట్ల రుణమాఫీ

ABN, First Publish Date - 2023-09-22T23:03:13+05:30

జిల్లా వ్యాప్తంగా 45,112 మంది రైతులకు రూ.256 కోట్ల రుణమాఫీ వర్తించనుందని కలెక్టర్‌ శ్రీహర్ష తెలి పారు.

బ్యాంకు అధికారితో రుణమాఫీ ప్రక్రియపై ఆరా తీస్తున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- కలెక్టర్‌ శ్రీహర్ష

- బ్యాంకుల సందర్శన, రుణమాఫీ ప్రక్రియపై ఆరా

నారాయణపేట టౌన్‌, సెప్టెంబరు 22 : జిల్లా వ్యాప్తంగా 45,112 మంది రైతులకు రూ.256 కోట్ల రుణమాఫీ వర్తించనుందని కలెక్టర్‌ శ్రీహర్ష తెలి పారు. ఇప్పటివరకు రూ.131 కోట్లు రైతుల ఖాతా లో జమ చేశామన్నారు. వ్యవసాయ అధికారులు మాఫీ జాబితాని గ్రామాల వారీగా సరిచేసి డబ్బు లు జమ కాని రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ బ్యాంకులను సందర్శించి, రుణమాఫీ ప్రక్రియలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఎన్ని ఖాతాల్లో మాఫీ ప్రక్రియ పూర్తి చేశా రు, వాటి వివరాలను అధికారులనడిగి తెలుసు కున్నారు. ఎస్‌బీఐలో 388 మందికి రుణమాఫీ చేశామని, అందులో కొందరు మృతి చెందారని, మరికొందరు మైగ్రేట్‌ అయ్యారని, మరికొందరు వివరాలు సేకరించాల్సి ఉందని, మొత్తం 388 ఖాతాలకు రూ.3.11 కోట్లు మాఫీ చేశామని అధి కారులు కలెక్టర్‌కు తెలిపారు. దామరగిద్ద ఎస్‌బీ ఐని సందర్శించిన కలెక్టర్‌ సమస్యలను మేనేజర్‌ ద్వారా ఆరా తీశారు. సిబ్బంది కొరత ఉంటే రుణ మాఫీ పూర్తయిన బ్యాంకుల సిబ్బందిని ఇక్కడికి రప్పించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకులో రూ.8.80 కోట్లు రుణమాఫీ చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్‌ వెంట వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్‌, ఎల్డీఎం విజ య్‌, బ్యాంకు అధికారులు ఉన్నారు.

చెక్కు పంపిణీ

మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేసిన మహిళా సంఘాల సభ్యులకు 2021-22కి సం బంధించిన కమిషన్‌ రూ.7 కోట్ల చెక్కును కలెక్టర్‌ శ్రీహర్ష శుక్రవారం కలెక్టరేట్‌లో అందించారు.

Updated Date - 2023-09-22T23:03:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising