Kodandaram : ఎన్టీఆర్ ప్రజల కోణంలో ఆలోచించేవారు
ABN, First Publish Date - 2023-05-28T03:30:36+05:30
ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రజల దృష్టికోణంలో ఆలోచించేవారు. అందుకే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. తాలూకా వ్యవస్థను రద్దు చేసి, మండల వ్యవస్థను తీసుకువచ్చారు
ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రజల దృష్టికోణంలో ఆలోచించేవారు. అందుకే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. తాలూకా వ్యవస్థను రద్దు చేసి, మండల వ్యవస్థను తీసుకువచ్చారు. దాంతో పాలన ప్రజల చెంతకు వచ్చినట్లు అయింది. ఆయన బడుగు, బలహీనవర్గాలకు రాజకీయాల్లో స్థానం కల్పించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలు చేయడం ద్వారా నిరుపేదలను ఆదుకున్నారు. పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టి వారికి ఆవాసం కల్పించారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. దీంతో గ్రామాల్లో అణిచివేత, వేధింపులకు గురి అవుతున్న వారికి గొప్ప ఊరట కలిగినట్లు అయింది. పేద వర్గాల ఆకాంక్షలను ఎన్టీఆర్ ఎన్నడూ మరిచిపోలేదు. కానీ.. ఎన్టీఆర్ తదనంతర కాలంలో ఆయన సంక్షేమ విధానాల కొనసాగింపు లేకుండా పోయింది. దానివల్లనే తెలంగాణ కొత్త పరిష్కారాలను వెతుక్కొవాల్సి వచ్చింది. ఆయన పథకాలు, విధానాలను తదుపరి పాలకులు గుర్తించలేకపోవడం, కొనసాగించకపోవడం తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది.
– ఎం. కోదండరామ్, రిటైర్డ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, ఫౌండర్, తెలంగాణ జన సమితి
Updated Date - 2023-05-28T03:30:36+05:30 IST