ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

షార్ట్‌ సర్క్యూట్‌తో లారీ దగ్ధం

ABN, First Publish Date - 2023-09-04T04:32:20+05:30

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై ఓ లారీ దగ్ధమైంది.

క్లీనర్‌ సజీవదహనం, తృటిలో తప్పించుకున్న డ్రైవర్‌

కూసుమంచి, సెప్టెంబరు 3: షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై ఓ లారీ దగ్ధమైంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గుర్వాయిగూడెం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో క్లీనర్‌ సజీవదహనం కాగా డ్రైవర్‌ త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం నుంచి కెమికల్‌ లోడుతో హైదరాబాద్‌కు వస్తోన్న ఓ లారీలో షార్ట్‌ సర్క్యుట్‌తో మంటలు చెలరేగాయి. లారీలో కెమికల్‌ డ్రమ్ములు ఉండడంతో మంటలు వాటికి అంటుకుని ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దాంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంకటేశ్‌ సడన్‌బ్రేక్‌ వేసి లారీని ఆపి కిందకు దూకాడు. కాని పక్కనే నిద్రలో ఉన్న క్లీనర్‌ ఆదినారాయణ (43) సజీవ దహనమయ్యాడు. తీవ్రగాయాలైన డ్రైవర్‌ను స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఆదినారాయణది అనకాపల్లి జిల్లా ఎస్‌. రాయవరం అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2023-09-04T04:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising