ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ వసతి గృహాలపై కొరవడిన పర్యవేక్షణ

ABN, First Publish Date - 2023-03-05T00:47:55+05:30

ఒకప్పుడు ప్రభుత్వ హాస్టళ్లలో సీటుకోసం విద్యార్థులు పోటీపడేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. దుస్తులు, భోజనం, దుప్పట్లు, పుస్తకాలు, వసతితోపాటు అన్నీ సమకూర్చినా ప్రభుత్వ హాస్టళ్లకు విద్యార్థులు రావడంలేదు. విద్యార్థులకు హాస్టళ్లలో రక్షణ లేకపోవడం, నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య దొరకడంలేదని, గురుకులాల సీట్లకోసం పోటీపడి ప్రభుత్వ హాస్టళ్లకు దూరమవుతున్నట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అద్దె భవనాల్లో వసతి గృహాలు

హాస్టళ్లలో తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య

ఒక్కొ వార్డెన్‌కు మూడు వసతి గృహాల బాధ్యతలు

భానుపురి, మార్చి 4: ఒకప్పుడు ప్రభుత్వ హాస్టళ్లలో సీటుకోసం విద్యార్థులు పోటీపడేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. దుస్తులు, భోజనం, దుప్పట్లు, పుస్తకాలు, వసతితోపాటు అన్నీ సమకూర్చినా ప్రభుత్వ హాస్టళ్లకు విద్యార్థులు రావడంలేదు. విద్యార్థులకు హాస్టళ్లలో రక్షణ లేకపోవడం, నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య దొరకడంలేదని, గురుకులాల సీట్లకోసం పోటీపడి ప్రభుత్వ హాస్టళ్లకు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా హాస్టళ్లపై జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ పూర్తిస్థాయిలో కొరవడింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టళ్లలో చేర్పించడానికి ఇష్టపడడంలేదు. ప్రభుత్వం లక్షల రూ పాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. విద్యార్థులు లేక కొన్నిచోట్ల ప్రభుత్వహాస్టళ్ల భవనాలు నిరుపయోగంగా మారాయి. మరికొన్ని హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదు. మెనూ సైతం పాటించడంలేదు. తక్కువ ధరలకు దొరికే కూరగాయలు, పప్పు, ఇతర సామాగ్రిని వాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో 85 వసతి గృహాలు

సూర్యాపేట జిల్లాలో 85సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 37మాత్రమే సొంత భవనాలు ఉండగా, 48 భవనాలు అద్దె భవనాలున్నాయి. అద్దెమాత్రం ప్రభుత్వం రూ.లక్షల్లో చెల్లిస్తోంది. సూర్యాపేట మండలంలోని యండ్లపల్లిలో ఉన్న ఎస్సీ బాలుర ప్రభుత్వ హాస్టల్‌ భవన సముదాయం రెండు ఎకరాల్లో ఉంది. అయితే ఇక్కడ హాస్టల్‌ విద్యార్థులు లేరని మూసివేశారు. కొద్దిమంది విద్యార్థులుంటే దురాజ్‌పల్లి సమీపంలో భవనాన్ని అద్దెకు తీసుకుని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో సు మారు 8,220 మంది విద్యార్థులు మాత్రమే ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో హాస్టల్‌లో 100మంది విద్యార్థులు ఉండాలని నిబంధన ఉన్నా కూడా ప్రభుత్వ అధికారులు శ్రద్ధ చూపడంలేదు. సూ ర్యాపేట జిల్లాలో ఎస్సీ హాస్టళ్లు 39 ఉన్నాయి. 33 హాస్టళ్లలో 3వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థు లు 1,829 మంది మాత్రమే హాస్టళ్లలో ఉంటున్నారు. ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులు 925 మంది ఉన్నారు. ఎస్టీ హాస్టళ్లు జిల్లాలో 21 ఉన్నాయి. 3నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 1900 మంది, ఇంటర్‌ నుంచి డిగ్రీచదివే విద్యార్థులు 1000 మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో బీసీ హాస్టళ్లు 25 ఉన్నాయి. 3 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 1,460 మంది, ఇంటర్‌ నుంచి డిగ్రీ చదివే విద్యార్థులు 1,024 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

వసతి గృహాలకు ఇన్‌ఛార్జీలే దిక్కు

సంక్షేమ వసతి గృహాలకు అన్ని చోట్ల ఇన్‌చార్జీలే దిక్కయ్యారు. మూడు నుంచి నాలుగు హాస్టళ్లకు ఒక వార్డెన్‌ ఇన్‌ఛార్జీగా వ్యవహరిస్తున్నారు. వార్డెన్లు లేకపోవడం వల్ల విద్యార్థుల చదువుపై శ్రద్ధ కొరవడింది. హాస్టళ్లు సైతం దూరంగా ఉండడంతో పర్యవేక్షణ కుంటుపడుతోంది. రాత్రిపూట విద్యార్థులను వార్డెన్లు పర్యవేక్షించడంలేదు.

విద్యార్థులు ఇంటికి వెళితే..

వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు ఇంటికి వెళి తే 10 రోజులవరకు రావడం లేదు. విద్యార్థులు ఎందుకు రావడం లేదని వార్డెన్లు తల్లిదండ్రులను అడగడం లేదు. ఇటీవల పెద్దగట్టు జాతరను పురస్కరించుకుని విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో కొన్ని వసతి గృహాలకు విద్యార్థులు చాలా రోజులవరకు తిరిగి రాలేదు. విద్యార్థులు లేకున్నా రిజిస్టర్లలో హాజరు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఎక్కువగా అద్దె భవనాల్లోనే.: అనసూయ, బీసీ జిల్లా అధికారి, సూర్యాపేట

48 ప్రభుత్వ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. గురుకులాల వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. విద్యార్థులు హాస్టళ్లను సద్వినియోగం చేసుకోవాలి. వార్డెన్ల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు హాస్టళ్ల బాధ్యతలు ఇచ్చాం.

అద్దె సొంత మొత్తం

భవనాలు భవనాలు

ఎస్సీ 25 14 39

ఎస్‌టీ 7 14 21

బీసీ 16 09 25

Updated Date - 2023-03-05T00:47:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising