ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు ఇవ్వాలి

ABN, First Publish Date - 2023-06-01T01:02:25+05:30

బ్రిటిష్‌ ప్రభుత్వం(యూకే) కోహినూర్‌ వజ్రాన్ని వెంటనే భారతదేశానికి తిరిగి ఇచ్చేయాలని నిజాం ముని మనవడు హిమాయత్‌ అలీ మిర్జా డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూకే ప్రభుత్వాన్ని కోరాలని ప్రధానికి విన్నపం

నిజాం ముని మనవడు హిమాయత్‌ అలీ మిర్జా

హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): బ్రిటిష్‌ ప్రభుత్వం(యూకే) కోహినూర్‌ వజ్రాన్ని వెంటనే భారతదేశానికి తిరిగి ఇచ్చేయాలని నిజాం ముని మనవడు హిమాయత్‌ అలీ మిర్జా డిమాండ్‌ చేశారు. ఆ వజ్రాన్ని బ్రిటిష్‌ పాలకులు నిజాంపై ఒత్తిడి పెంచి.. బలవంతంగా తీసుకున్నారని ఆయన ఆరోపించారు. కోహినూర్‌ వజ్రం కేవలం విలువైనది మాత్రమే కాదు.. భారతదేశ చరిత్రతో ముడిపడిన అంశమని.. మనకు గర్వకారణమని మిర్జా అన్నారు. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో బ్రిటిష్‌ రాజులకు సత్సంబంధాలుండేవని.. ఆ స్నేహాన్ని గౌరవిస్తూ ఆ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆయన కోరారు. అందుకు యూకే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన దేశ ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ఓ ప్రకటన వెలువరించారు. నిజాం వారసులకు రావాల్సిన వాటా డబ్బుల కోసం యూకేలో జరిగిన న్యాయ పోరాటం.. అందులో నిజాం వారసులు గెలిచిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ప్రయత్నిస్తే వజ్రాన్ని రప్పించడం కూడా సాధ్యమేనని అన్నారు. ఒకవేళ యూకే ప్రభుత్వం కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మిర్జా హెచ్చరించారు.

Updated Date - 2023-06-01T01:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising