మద్దతు ధరే మా మొదటి ప్రాధాన్యం: కిషన్‌రెడ్డి
ABN, First Publish Date - 2023-06-11T03:43:22+05:30
ప్రధాని మోదీ ప్రభుత్వం వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ప్రభుత్వం వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. పెద్ద ఎత్తున ఎరువుల సబ్సిడీ ఇస్తూ, పండిన పంటలను సరైన మద్దతు ధరలకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఒక్క ఎరువుల మీదనే రూ.27 వేల కోట్ల రూపాయల సబ్సిడీ తెలంగాణ రైతులకు కేంద్రం అందజేసిందని వివరించారు. తాజాగా పెంచిన పంటల మద్దతు ధర ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. శనివారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు కేంద్రం రూ. 26,307 కోట్లు వెచ్చిస్తోందని చెప్పారు. ఎరువుల సబ్సిడీ, పీఎం కిసాన్ సమ్మాన్ యోజనా కలిపి ఒక ఎకరం ఉన్న రైతుకు రూ.24,500 మేలు జరుగుతోందన్నారు. తాను ప్రధాని మోదీని అభ్యర్థించి రాష్ట్రానికి టెక్స్‌టైల్ పార్కును తీసుకొస్తే, బీఆర్‌ఎస్‌ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదన్నారు.
Updated Date - 2023-06-11T03:43:22+05:30 IST