ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘పదికి పది’ గెలుస్తాం

ABN, First Publish Date - 2023-09-25T23:55:12+05:30

కొత్త పాత తేడా లేకుండా.. అందరం ఐక్యం పనిచేసి.. ఉమ్మడిజిల్లాలో పదికిపది నియోజకవర్గాలను గెలవడంతో పాటు రాష్ట్రంలోనూ కాంగ్రె్‌సను అధికారంలోకి తెస్తామని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సంబాని చంద్రశేఖర్‌ తదితరులు ప్రకటించారు.

కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన సభలో సంబాని, తుమ్మల, భట్టి, పొంగులేటి తదితర నేతల అభివాదం

ర్యాలీలో అభివాదం చేస్తున్న తుమ్మల, పక్కన భట్టి, పొంగులేటి,

బారుగూడెం నుంచి ఖమ్మానికి ర్యాలీగా వస్తున్న నాయకులు, కార్యకర్తలు

కాంగ్రె్‌సను అధికారంలోకి తెస్తాం

భట్టి, తుమ్మల, పొంగులేటి, సంబాని

ఐక్యంగా కదిలిన నాయకులు

కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో తుమ్మలకు ఘనస్వాగతం

ఖమ్మం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): కొత్త పాత తేడా లేకుండా.. అందరం ఐక్యం పనిచేసి.. ఉమ్మడిజిల్లాలో పదికిపది నియోజకవర్గాలను గెలవడంతో పాటు రాష్ట్రంలోనూ కాంగ్రె్‌సను అధికారంలోకి తెస్తామని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సంబాని చంద్రశేఖర్‌ తదితరులు ప్రకటించారు. కాంగ్రె్‌సలో చేరిన అనంతరం తుమ్మలతొలిసారి సోమవారం ఖమ్మం వచ్చారు. తొలుత ఖమ్మం రూరల్‌మండలం బారుగూడెం శ్రీసిటీలోని తన నివాసానికి చేరుకున్న ఆయన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం అందరితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి.. సాయంత్రం ఉమ్మడిజిల్లా నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి వరంగల్‌క్రాసరోడ్డు, కాల్వొడ్డుమీదుగా ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓపెనటా్‌ప వాహనంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార కమిటీ కో కన్వీనర్‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ తదితరులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఈ ర్యాలీ ముందు భాగాన తుమ్మల తనయుడు యుగంధర్‌ నడిచారు. వేలాది మంది కార్యకర్తలు బాణసంచా కాల్చి, ‘జై కాంగ్రెస్‌, జైతుమ్మల’ అంటూ నినాదాలు చేశారు. ప్రధాన కూడళ్లలో పూలవర్షం కురిపించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయానికి చేరుకున్న తుమ్మలకు కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు.

ప్రజల సంపద దోచుకునేవారంతా

బీఆర్‌ఎ్‌సలోనే : భట్టి

రాష్ట్రంలో 74నుంచి78సీట్లు గెలుచుకుని కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోందని, రాష్ట్ర సంపద దోచుకునేవారంతా బీఆర్‌ఎ్‌సలో ఉంటే.. ఆ సంపదను పరిరక్షించుకోవాలనుకున్న వారంతా కాంగ్రె్‌సకి వస్తున్నారని, ఎవరు ఎన్ని ఆటంకాలు కలిపించినా ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తుమ్మల లాంటి సీనియర్‌ నేత కాంగ్రె్‌సలో చేరడం అభినందనీయమన్నారు. సోనియాగాంధీ ప్రకటించిన ఆరుగ్యారంటీపథకాలతో బీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులు ఆగమాగం అవుతున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే రైతు రుణమాఫీతోపాటు ఈపథకాలు అమలుచేస్తామన్నారు. కేసీఆర్‌లా దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం లాంటి లెక్కలేని హామీలు ఇవ్వడం లేదని, అమలుకు వీలయ్యే హామీలను మాత్రమే కాంగ్రెస్‌ చెబుతోందన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తమ పరిపాలన ఉంటుందని, జర్నలిస్టుల సంక్షేమంపై కాంగ్రెస్‌ చిత్తశుద్ధితో ఉందని, జర్నలిస్టుల సంక్షేమానికి చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను ఎన్నికల మేనిఫేస్టోలో పొందుపరుస్తున్నామని త్వరలో వాటిని ప్రకటిస్తామన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా

పరిపాలన ఉంటుంది : పొంగులేటి

రాష్ట్రంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన ఉండబోతోందని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార కమిటీ కో కన్వీనర్‌, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇక టీఎ్‌సపీఎస్‌ ఉద్యోగ నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి దోచుకోవడం, దాచుకోవడం తప్పా ప్రజాసంక్షేమం పట్టడంలేదని, గ్రూప్‌ 1నుంచి గ్రూప్‌ 4వరకు ఏ ఉద్యోగ నియామకాలు లేవని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పరీక్షల రద్దుతో ప్రతీ నిరుద్యోగి కోచింగ్‌ సెంటర్లలో రూ.లక్షవరకు ఖర్చుచేసి నష్టపోతే వారికి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించలేదని, ఆఖరికి చదువుకునే విద్యార్థుల పరీక్షల పత్రాలు కూడా ఫెయిలైనట్టు రావడంతో 25మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆకుటుంబాలను కూడా ఆదుకోలేదని, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామని మోసం చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదని విమర్శించారు. మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గాలి వీస్తోందని, అందరం కాంగ్రెస్‌ విజయం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నగర అధ్యక్షుడు జావీద్‌ మాట్లాడుతూ పెద్దనేతలంతా కాంగ్రె్‌సలోకి వస్తుండటం పార్టీకి అదనపు బలాన్ని చేకూర్చిందని, తామంతా సమష్టిగా కాంగ్రెస్‌ విజయం కోసం పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో తుమ్మల యుగంధర్‌, పోట్ల నాగేశ్వరరావు, దీపక్‌చౌదరి, రాయల నాగేశ్వరరావు, సాధురమే్‌షరెడ్డి, తాటి వెంకటేశ్వర్లుతో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థిత్వాలు ఆశిస్తున్న నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్పొరేటర్లు హాజరయ్యారు.

Updated Date - 2023-09-25T23:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising