ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీసీసీబీ అర్ధవార్షిక నివేదికకు ఏకగ్రీవ ఆమోదం

ABN, First Publish Date - 2023-03-18T23:52:09+05:30

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 122వ మహాజనసభ శనివారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సభలో గతేడాది ఏప్రిల్‌ నుంచి అదేఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకు జరిగిన అర్థ సంవత్సర వార్షిక నివేదిక, ఖర్చులు, 2023-24నకు అంచనా బడ్జెటు, బ్యాంకు నిబంధనల సవరణ, ఉద్యోగుల సర్వీసు నిబంధనల అమలు తదితర అంశాలపై బ్యాంకు సీఈవో అట్లూరి వీరబాబు ప్రవేశపెట్టిన తీర్మానాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.

సమావేశంలో మాట్లాడుతున్న నాగభూషయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఖమ్మం వ్యవసాయం, మార్చి 18 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 122వ మహాజనసభ శనివారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చైర్మన్‌ కూరాకుల నాగభూషయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సభలో గతేడాది ఏప్రిల్‌ నుంచి అదేఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకు జరిగిన అర్థ సంవత్సర వార్షిక నివేదిక, ఖర్చులు, 2023-24నకు అంచనా బడ్జెటు, బ్యాంకు నిబంధనల సవరణ, ఉద్యోగుల సర్వీసు నిబంధనల అమలు తదితర అంశాలపై బ్యాంకు సీఈవో అట్లూరి వీరబాబు ప్రవేశపెట్టిన తీర్మానాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. సహకార సంఘాలకు మార్క్‌ఫెడ్‌ నుంచి వచ్చే ఎరువుల నాణ్యత, ధరలపై సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. బూర్గంపాడు సహకార సంఘం పరిధిలోని నాలుగు గ్రామాల్లోని 430 మంది రైతులు పోలవరం ప్రాజెక్టు కింద భూమిని కోల్పోయారని, వారికి సంబంధించిన రూ.1.50 కోట్లు వసూలు కాని బాకీల కింద నమోదు చేయాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లా సంఘ అధ్యక్షులంతా చైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు.

పీఏసీఎస్‌ స్థాయిలో నూరుశాతం రుణాలు వసూలు చేసిన సత్తుపల్లి, నేలకొండపల్లి మండలంలోని మండ్రాజుపల్లి సంఘాల అధ్యక్షులు చల్లగుళ్ల కృష్ణయ్య, తోట వెంట్రావును ఘనంగా సత్కరించారు. కొత్త కోఆప్షన డైరెక్టర్లు మోదుగు పుల్లారావు, నూకారపు సైదులును సభ్యులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన రాయల వెంకట శేషగిరిరావు, వైస్‌చైర్మన కొత్వాల శ్రీనివాసరావు, డీసీవో విజయకుమారి, వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల, మార్కెఫెడ్‌ డీఎం సునీత, సీఈవో వీరబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T23:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising