ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్నాళ్లో వేచిన ఉదయం

ABN, First Publish Date - 2023-06-29T23:40:16+05:30

పోడు పట్టాల పంపిణీకి సర్వం సిద్దమైంది. హక్కు పత్రాల కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పోడు రైతుల కల నెరవేరబోతోంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో పంపిణీకిఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. పాల్వంచ పట్టణ పరిధిలోని సుగుణగార్డెనలో గురువారం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

పోడు పట్టాల పంపణీ స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనుదీప్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు పోడుపట్టాల పంపిణీకి శ్రీకారం

హాజరుకానున్న మంత్రులు హరీష్‌రావు, అజయ్‌కుమార్‌

పాల్వంచలో ఏర్పాట్లను పరిశీలించిన భద్రాద్రి కలెక్టర్‌ అనుదీప్‌

ఆంద్రజ్యోతి కొత్తగూడెం, జూన 29: పోడు పట్టాల పంపిణీకి సర్వం సిద్దమైంది. హక్కు పత్రాల కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పోడు రైతుల కల నెరవేరబోతోంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో పంపిణీకిఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. పాల్వంచ పట్టణ పరిధిలోని సుగుణగార్డెనలో గురువారం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శుక్రవారం జరిగే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీ్‌షరావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హాజరువుతున్నారన్నారు. తొలిరోజు నియోజకవర్గానికి 500మంది చొప్పున మొత్తం 2,500మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారన్నారు. జిల్లా మొత్తంలో 50,595 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అన్ని నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల నుంచి లబ్ధిదారులకు పట్టాల పంపిణీ ఉంటుందన్నారు. పోడు పట్టాలు పంపిణీకి సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. పట్టాలు తీసుకునే లబ్ధిదారులను గ్రామాస్థాయి నుంచి సమీకరించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులను తరలించేందుకు పక్కా ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఎంపీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి పోడు పట్టాలు తీసుకోనున్న లబ్ధిదారులను తీసుకొస్తారన్నారు. ఆయా గ్రామాలకు సంబంధించిన సర్పంచలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్యదర్శులు హజరయ్యేలా చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈవో విద్యాలతను ఆదేశించారు. పట్టాల పంపిణీ ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేయాలని ఉద్యాన అధికారి మరియన్నను ఆదేశించారు. పట్టాలు జారీలో క్రమపద్దతి పాటించేందుకు పోలీ్‌సబందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హాలులో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేయాలన్నారు. పోడు పట్టా పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారులు క్యూ పాటించేందుకు వీలుగా బారికేడ్ల ఏర్పాటుతో పాటు నియోజవర్గాల వారీగా మండలాల కౌంటర్లు, సైనేజీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పట్టాలు తీసుకోనున్న లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. భోజనాల వద్ద రద్దీ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఐడీఓఐసీ కార్యాలయంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో మదుసూధనరాజు, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, జడ్పీ సీఈవో విద్యాలత, డీపీవో రమాకాంత, డీసీవో వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ డీఈ నాగేశ్వరరావు డీఆర్‌వో అశోక్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి జిల్లాలో పోడు లబ్ధిదారులు ఇలా..

నియోజకవర్గం పంచాయతీలు శివారు రైతులు ఎకరాలు

గ్రామాలు

పినపాక 91 209 15,062 52,438.39

ఇల్లెందు 55 137 12,347 36,588.37

వైరా 12 29 1,812 4,826.40

కొత్తగూడెం 45 77 4,541 15,311.27

అశ్వారావుపేట 69 181 9,418 25,817.15

భద్రాచలం 41 84 6,515 16,211.02

313 717 50,595 1,51,195.00

మంత్రి హరీష్‌ పర్యటన ఇలా..

శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయల్దేరనున్న మంత్రి హరీ్‌షరావు ఉదయం 11గంటలకు భద్రాద్రి కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి ఉదయం 11:35గంటలకు పాల్వంచ సుగుణగార్డెన ఫంక్షన హాలుకు చేరుకుని పోడు పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భోజనానంతరం మధ్యాహ్నం 2.35కు కొత్తగూడెం కలెక్టరేట్‌ హెలీప్యాడ్‌ నుంచి ఖమ్మం చేరుకుని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే పోడు పట్టాలపంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఖమ్మం జిల్లాలో 6,589మందికి పట్టాలు

భక్తరామదాసు కళాక్షేత్రంలో కార్యక్రమం

ఖమ్మం, జూన 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం జిల్లాలోని పోడురైతులకు శుక్రవారం హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు తన్నీరు హరీ్‌షరావు, పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రం ఆవరణలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,589మంది లబ్దిదారులకు 13,139.03 ఎకరాల పోడు భూములను హక్కుపత్రాలు అందించనున్నారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలంలో 13గ్రామాలకు సంబంధించి 694మంది లబ్దిదారులకు 1,707.12 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేస్తారు. సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలంలోని 16గ్రామాలకు చెందిన 801మంది రైతులకు 1437.23 ఎకరాలు, సత్తుపల్లి మండలంలో 11గ్రామాలకు చెందిన రైతులకు 1196మంది రైతులకు 1651.03 ఎకరాలు, తల్లాడ మండలంలో ఒక గ్రామానికి చెందిన ఒకరైతుకు 1.16ఎకరాలు, వేంసూరు మండలంలో ఒక గ్రామానికి చెందిన ఒక రైతుకు 0.15ఎకరాలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు మండలంలో 10గ్రామాలకు చెందిన 269మంది పోడుదారులకు 709.25ఎకరాలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. కొణిజర్ల మండలంలో 16గ్రామాలనుంచి 1287మంది లబ్ధిదారులకు 1,908.02ఎకరాలు, సింగరేణి మండలంలో 33గ్రామాలకు చెందిన 21.01మంది రైతులకు 5070.27 ఎకరాలు, కామేపల్లి మండలంలో 5గ్రామాలకు చెందిన 239మంది పోడుదారులకు 653.00ఎకరాలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

Updated Date - 2023-06-29T23:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising