అనుమతిలేకుండా లేఅవుట్లు వేస్తే కఠిన చర్యలు
ABN, First Publish Date - 2023-03-05T00:26:22+05:30
గ్రామాలు, మండల కేంద్రాలు, మునిసిపల్ పట్టణాల్లో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ‘రియల్’ వెంచర్లు వేస్తున్నారని, అలా అనుమతి లేకుండా వెంచర్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా గ్రామీణ, పట్టణ ప్రణాళిక అధికారి జీవీఎ్‌సవీ ప్రసాద్ తెలిపారు.
గ్రామాల్లోనూ అనుమతులు తప్పనిసరి
అనుమతి లేని లేఅవుట్లు ఉంటే ఫిర్యాదు చేయొచ్చు
జిల్లా గ్రామీణ, పట్టణ ప్రణాళిక అధికారి జీవీఎస్‌వీ ప్రసాద్
ఖమ్మం,మార్చి4(ఆంధ్రజ్యోతిప్రతినిధి): గ్రామాలు, మండల కేంద్రాలు, మునిసిపల్ పట్టణాల్లో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ‘రియల్’ వెంచర్లు వేస్తున్నారని, అలా అనుమతి లేకుండా వెంచర్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా గ్రామీణ, పట్టణ ప్రణాళిక అధికారి జీవీఎ్‌సవీ ప్రసాద్ తెలిపారు. ఆయన శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్యూలో శాఖపరంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు
ఆంధ్రజ్యోతి: జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రణాళిక ద్వారా శాఖపరంగా చేపడుతున్న చర్యలు ఏంటీ?
ప్రణాళిక అధికారి: జిల్లాలో ఖమ్మం సుడా మినహా ఇతర మునిసిపల్, మండల, గ్రామీణ ప్రాంతాల్లో రియల్ వెంచర్లు ఎవరు వేసినా రెండున్నర ఎకరాలలోపు లేఅవుట్లకు మేమే అనుమతి ఇస్తాం. అంతకుమించి ఐదు ఎకరాల వరకు ఉంటే వరంగల్ రీజనల్ కార్యాలయంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా అనుమతి లేకుండా వెంచర్లు వేస్తే వారికి నోటీసులు ఇచ్చి శాఖపరంగా చర్యలు తీసుకుంటాం.
ఆంధ్రజ్యోతి: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో కూడా అనధికారికంగా వెంచర్లు ఉన్నాయి కదా? ఇప్పటి వరకు వాటిపై ఏం చర్యలు తీసుకున్నారు?
ప్రణాళిక అధికారి: జిల్లాలో సత్తుపల్లితో పాటు మరికొన్ని చోట్ల అనుమతులులేకుండా ఉన్న లేఅవుట్లను గుర్తించి వారికి నోటీసులు జారీచేశాం. ప్రస్తుతం ఆయా వెంచర్ల యజమానులు డీటీసీపీ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 50కి పైగా వెంచర్లు అనుమతులు తీసుకుని వేశారు.మూడుచోట్ల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆంధ్రజ్యోతి: కొందరు దరఖాస్తు చేసుకుని డీటీసీపీ అనుమతి ఉందని ప్లాట్లు విక్రయాలు చేస్తున్నారు కదా ?
ప్రణాళిక అధికారి: అలా విక్రయించడం చట్టరిత్యా నేరం. కొనుగోలుదారులు కూడా పూర్తి అనుమతులు ఉంటేనే ప్లాట్లు కొనుగోలు చేయాలి. దరఖాస్తు చేసినంతమాత్రాన అనుమతి వచ్చినట్లు కాదు. సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో కూడా డీటీసీపీ అనుమతి ఉన్న వాటికి మాత్రమే రిజిస్ర్టేషన చేయాలనే నిబంధనలున్నాయి. ఈ నిబంధనలు అతిక్రమించి రిజిస్ర్టేషన చేసినా అవి చెల్లవు.
ఆంధ్రజ్యోతి: డీటీసీపీ అనుమతి పొందాలంటే నిబంధనలు ఏంటి ?
ప్రణాళిక అధికారి: రెండున్నర ఎకరాలలోపు లేఅవుట్ చేసిన భూమి వివరాలు, మ్యాప్, ఓనర్‌షిప్, ల్యాండ్ కన్వర్షన, 33 అడుగుల రోడ్లు, విద్యుత, తాగునీరు వంటి మౌళికసదపాయాలు పదిశాతం గ్రీనరీ కోసం ల్యాండ్ డిపాజిట్ చేయాలి. ఆనలైనలో దరఖాస్తు చేస్తే క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీతోపాటు ల్యాండ్ సర్వే, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారు. జిల్లాలో ఉన్న 580 పంచాయతీలలో కూడా గ్రామాల్లో ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినా డీటీసీపీ అనుమతి తీసుకోవాలి. వీటిపై పర్యవేక్షణ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. క్షేత్రస్థాయిలో పంచాయతీ సిబ్బంది కూడా పర్యవేక్షణ చేసి అనుమతులు లేని వాటిని గుర్తిస్తారు. ఎక్కడైనా ఇంకా అనధికారికంగా లేఅవుట్ల ఉంటే 9441387468 నెంబరుకు ఫోనచేసి ఫిర్యాదు చేయవచ్చు.
Updated Date - 2023-03-05T00:26:22+05:30 IST