ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల బడి

ABN, First Publish Date - 2023-06-11T00:58:35+05:30

వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలు పునః ప్రారంభమవుతున్నా ప్రభుత్వ పాఠశాలు మాత్రం సమస్యల లోగిళ్లుగానే దర్శనమిస్తున్నాయి. బడులు తెరుచుకునే నాటికి పాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మనఊరు-మనబడి, మనబస్తీ- మనబడి’ పథకాన్ని చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమ్ముగూడెం పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న డైనింగ్‌ హాల్‌

ఖమ్మం ఎన్నెస్సీ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న అదనపు గదులు

గడువు ముగిసినా పూర్తికాని ‘మనఊరు-మనబడి’ పనులు

అధికారుల పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

ఖమ్మం జిల్లాలో 24శాతమే పూర్తయిన పనులు

అసంపూర్తి పనులతో విద్యార్థులకు అవస్థలు

రేపు పాఠశాలల పునః ప్రారంభం

ఖమ్మం ఖానాపురం హవేలీ/కొత్తగూడెం కలెక్టరేట్‌, జూన 10: వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలు పునః ప్రారంభమవుతున్నా ప్రభుత్వ పాఠశాలు మాత్రం సమస్యల లోగిళ్లుగానే దర్శనమిస్తున్నాయి. బడులు తెరుచుకునే నాటికి పాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మనఊరు-మనబడి, మనబస్తీ- మనబడి’ పథకాన్ని చేపట్టింది. కానీ ఈ పథకం ద్వారా చేపట్టిన పనులు ‘‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’’ అన్న చందంగా మారాయి. పాఠశాలలో విద్యార్థులకు కావలసిన మౌలిక సౌకర్యాలైన టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, తరగతి గదుల మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, కిటికీల మరమ్మతులు, విద్యుత్‌ మరమ్మతులు, గదులకు రంగులు వేయడం తదితర పనులతో పాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేేసందుకు డైనింగ్‌ హాల్‌ నిర్మాణం పనులు చేపట్టడానికి అధికారులు చేపట్టిన పనులు ఖమ్మం జిల్లాలో కేవలం 24శాతమే పూర్తయ్యాయి. అసంపూర్తిగా మిగిలిన పనులు విద్యార్థులకు ఆటంకంగా మారనున్నాయి. ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం అమలులో ఖమ్మం జిల్లాల రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినా పనులు పూర్తిచేయడంలో వెనుకబడే ఉందని చెప్పవచ్చు. ఎక్కువ శాతం పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్నభోజన సమయంలో చేతులు కాళ్లు కడుక్కునేందుకు నల్లాల మరమ్మతులు చేపట్టలేదు. డైనింగ్‌ హాళ్ల నిర్మాణం పూర్తికాలేదు. జూన్‌ 1 నాటికి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల పుస్తకాలు పాఠశాలలకు చేరాల్సి ఉండగా పూర్తి స్ధాయిలో ఇప్పటివరకు మండల కేంద్రాలకు కూడా చేరలేదు. పాఠశాలలు తెరిచే సమయానికే విద్యార్ధులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ అందిస్తామన్న అదికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. మౌలిక సౌకర్యాలు, పుస్తకాలు, యూనిఫాం లేకుండా పాఠశాలలు కొనసాగేదెలా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి గతేడాది వేసవి సెలవుల్లో పనులు ప్రారంభించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఖమ్మం జిల్లాలో ఆనుకున్న స్థాయిలో పనులు జరగడం లేదు. పనులు చేపట్టి 14నెలలు గడిచినా కేవలం 104పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. రేపటినుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో అసంపూర్తిగా మిగిలిన పనులు విద్యార్థులకు అసౌకర్యంగా మారనున్నాయి.

104 పాఠశాలల్లోనే పనులు పూర్తి

ఖమ్మం జిల్లాలో మొత్తం 426 పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ పనులు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల పనులు పూర్తి కాగా చాలాచోట్ల పడకేశాయి. కేవలం 104పాఠశాలల్లో మాత్రమే 100శాతం పనులు పూర్తయ్యాయి. 106పాఠశాలల్లో 50శాతం కంటే తక్కువగా పనులు జరిగాయి. పాఠశాలల్లో రూ.30 లక్షలలోపు పనులను ఎస్‌ఎంసీల ద్వారా పూర్తి చేయాలి. బడ్జెట్‌ ఎక్కువ ఉన్న పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. చాలా చోట్ల పూర్తి చేసిన పనులకు నిర్ణీత వ్యవధిలో బిల్లులు రాకపోవడంతో కొత్త పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు, ఎస్‌ఎంసీల బాధ్యులు ముందుకు రావడంలేదు. పెరిగీన ధరలకు అనుగుణంగా రేట్లు ఇవ్వకపోవడంతో నష్టపోతున్నట్లు ఓ కాంట్రాక్టర్‌ తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేస్తున్నా సకాలంలో బిల్లులు రాక, వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కొందరు బిల్లులు రావేమోనని పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి సంబధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. పనుల పురోగతిపై కలెక్టర్‌ తరచూ సమీక్షిస్తున్నారన్నారు. జూన 12వరకు ఎక్కువ శాతం పనులు పూర్తవుతాయన్నారు. కొన్ని పాఠశాలల్లో పనులు పూర్తి కాకపోవటంపై కొంతమంది కాంట్రాక్టర్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి విడతలో మొత్తం 368పాఠశాలల్లో ‘మనఊరు-మనబడి’ పనులు చేపట్టారు. ఇందులో 246ప్రాథమిక పాఠశాలలు, 57ప్రాథమికోన్నత పాఠశాలలు, 65ఉన్నత పాఠశాలలు ఉన్నాయి ఇప్పటి వరకు కేవలం 45పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తి చేశారు. వాటిలో మూడు పాఠశాలలను ప్రారంభించారు. 31 పాఠశాలలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. 64 పాఠశాలల్లో 50శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణ పనులకు ఎస్‌ఎంసీలకు రూ.27కోట్లు, ఎనఆర్‌జిఎ్‌స నుంచి రూ.11కోట్లు విడుదల చేశారు. నిధులున్నా పనులు మాత్రం నెలల తరబడి సాగుతున్నాయి.

అసంపూర్తి పనులతో అవస్థలు

పాల్వంచ పట్టణ పరిధిలోని కొమ్ముగూడెం (గొల్లగూడెం) ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి పథకంలో రూ.26లక్షలతో విద్యుదీకరణ, మేజర్‌, మైనర్‌ రిపేర్లు, డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్ల నిర్మాణం పనులు చేపట్టారు. మూడు నెలల క్రితం చేపట్టిన ఈ పనులు నేటికి అసంపూర్తిగానే ఉన్నాయి. ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలోని ఎంపీపీఎస్‌ పాఠశాలకు రూ.45 లక్షలతో తగరతి గదుల భవనం మంజూరైంది. గతేఏడాది డిసెంబర్‌లో పాతభవనాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం కొత్తభవనం నిర్మాణం పునాది దశలోనే ఉంది. సోమవారం పాఠశాల ప్రారంభం కానున్న నేపథ్యం లో తరగతులు ఎక్కడ నిర్వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దమ్మపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.48లక్షలతో డైనింగ్‌ హాల్‌, పాలి్‌షరాయి వేయడం, మైనర్‌ పనులు చేపట్టారు. జనవరిలో పనులు ప్రారంభించగా కూలీల సమస్యతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు పూర్తి కావడానికి మరో 20 రోజులు పడుతుంది.

Updated Date - 2023-06-11T00:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising