ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా రంజాన వేడుకలు

ABN, First Publish Date - 2023-04-23T00:22:46+05:30

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం రంజాన వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఈద్గాల వద్ద ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. తెల్లవారుజామునుంచే ఖమ్మం నగరం లో రంజాన సందడి నెలకొంది. ఖమ్మం ఖిల్లాతోపాటు, పలు మొహల్లాలు, తదితర ముస్లింల ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్‌,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు

ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

గొల్లగూడెం ఈద్గా ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్‌

ఖమ్మం సాంస్కృతికం/కొత్తగూడెం సాంస్కృతికం, ఏప్రిల్‌ 22: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం రంజాన వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఈద్గాల వద్ద ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. తెల్లవారుజామునుంచే ఖమ్మం నగరం లో రంజాన సందడి నెలకొంది. ఖమ్మం ఖిల్లాతోపాటు, పలు మొహల్లాలు, తదితర ముస్లింల ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. గొల్లగూడెం, గాంధీచౌక్‌ తదితర ఈద్గాలలో షామియానాలు ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలకోసం శుక్రవారం సాయంత్రం చేసిన ఏర్పాట్లు రాత్రి కురిసిన గాలివానకు దెబ్బతినడంతో శనివారం ఉదయం హుటాహుటిన మళ్లీ ఏర్పాట్లు చేశారు. రంజాన సందర్బంగా నగరంలో సర్వమత సౌభ్రాతృత్వం వెల్లివిరిసింది. మసీదుల ప్రాంతాల్లో పలువురు ముస్లిమేతరులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పరస్పరం ఆలయ్‌ బలయ్‌ తెలిపారు. ప్రార్థనలకు హాజరయ్యే వారికోసం మంచినీరు, మజ్జిగ ఏర్పా ట్లుచేయగా అనేక ముస్లిం కుటుంబాలవారు తమ స్నేహితులను విందులకు ఆహ్వానించారు. పలుచోట్ల సేమ్యా, ఖీర్‌ పంపిణీ చేశారు.

ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి

నగరంలోని గొల్లగూడెం ఈద్గా వద్ద నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ ముస్లింలకు అండగా ఉన్నారన్నారు. ప్రార్థనల అనంతరం మంత్రి అజయ్‌ ఆత్మీయఆలింగనాలతో ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట డీసీసీబీ చైర్మన కూరాకుల నాగభూషణం ఉన్నారు.

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు రంజాన విశిష్టతను తెలియచేసి సందేశాన్ని వినిపించారు. కొత్తగూడెంలోని బోడగుట్ట, లక్ష్మిదేవిపల్లి శ్రీరామచంద్ర కళాశాల ప్రాంగణంలో, రుద్రంపూర్‌, రామవరం ప్రాంతాల్లోని ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్‌ నాయకుడు ఎడవల్లి కృష్ణ పాల్గొన్నారు. పాల్వంచ, జూలూరుపాడు, ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరు తదితరా ప్రాం తాల్లోనూ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Updated Date - 2023-04-23T00:22:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising