అనుబంధానికి ‘రక్ష’
ABN, First Publish Date - 2023-08-29T23:22:04+05:30
సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీపండుగకు సర్వం సిద్ధమైంది. ఆడబిడ్డలు తమ అన్నదమ్ములు తాము సుఖసంతోషాలతో జీవితాంతం కలిసిమెలసి ఉండాలని కోరుకుంటూ సోదరులకు రాఖీలు కడతారు. ఇక రాఖీ పండుగ నేపథ్యంలో పల్లెలు, పట్టణాల్లో మార్కెట్లు సందడి కనిపిస్తున్నాయి. రాఖీ విక్రయాలతో షాపులు కళకళలాడుతున్నాయి. అలాగే స్వీట్ షాపుల వద్ద రద్దీ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది రాఖీ పండుగ విషయంలో సందిగ్ధం నెలకొంది. దీనిపై సోషల్‌మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు పండితులు 30వ తేదీ ఉదయం 10గంటల నుంచి 31వ తేదీ ఉదయం 7.45 వరకు పండుగ చేసు
సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీపండుగకు సర్వం సిద్ధమైంది. ఆడబిడ్డలు తమ అన్నదమ్ములు తాము సుఖసంతోషాలతో జీవితాంతం కలిసిమెలసి ఉండాలని కోరుకుంటూ సోదరులకు రాఖీలు కడతారు. ఇక రాఖీ పండుగ నేపథ్యంలో పల్లెలు, పట్టణాల్లో మార్కెట్లు సందడి కనిపిస్తున్నాయి. రాఖీ విక్రయాలతో షాపులు కళకళలాడుతున్నాయి. అలాగే స్వీట్ షాపుల వద్ద రద్దీ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది రాఖీ పండుగ విషయంలో సందిగ్ధం నెలకొంది. దీనిపై సోషల్‌మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు పండితులు 30వ తేదీ ఉదయం 10గంటల నుంచి 31వ తేదీ ఉదయం 7.45 వరకు పండుగ చేసుకోవచ్చని చెబుతుండగా.. ఇంకొందరు 31వ తేదీన ఉదయం 6.30 నుంచి 9.45 లోపు, మళ్లీ 10.50 నుంచి 11.50లోపు, మఽధ్యాహ్నం 12.30 నుంచి 2.45గంటల వరకు, తిరిగి సాయంత్రం 3.45 నుంచి 6 గంటల మధ్య రాఖీపండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. ఇంకొందరైతే సోదరులకు మంచిమనసుతో రాఖీ కట్టేందుకు ముహూర్తంతో పనేముందని, 30, 31తేదీల్లో ఎప్పుడైనా కట్టవచ్చన్న అభిప్రాయాలు చెబుతుండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నాయి. ఏదేమైనా ఆడపడుచులు మాత్రం తమ సోదరులకు రాఖీలు కట్టి తమ ప్రేమను చాటేందుకు సిద్ధమవుతున్నారు.
- ఖమ్మం సాంస్కృతికం
Updated Date - 2023-08-29T23:22:04+05:30 IST