ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాహుల్‌ సభకు కసరత్తు షురూ

ABN, First Publish Date - 2023-06-26T00:58:09+05:30

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా త్వరలో ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన బహిరంగసభకు కసరత్తు షురూ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్థలాలను పరిశీలించిన కాంగ్రెస్‌ నేతలు

సూర్యాపేటలో సీఎల్పీ నేత భట్టితో సమావేశం

పీపుల్స్‌మార్చ్‌ ముగింపు చిహ్నంగా 20 అడుగుల పైలాన

పొన్నెకల్‌ వద్ద నిర్మాణ పనులు ముమ్మురం

ఖమ్మం (ఆంధ్రజ్యోతిప్రతినిధి)/ఖమ్మం సంక్షేమ విభాగం, జూన 25 : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా త్వరలో ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన బహిరంగసభకు కసరత్తు షురూ అయ్యింది. ఈ సభకు రాహుల్‌గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని, 3లక్షలమందిపైగా జనాన్ని సమీకరించాలని ఆదివారం సూర్యాపేటలో జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో భట్టి వారికి సూచించారు. దీంతో జిల్లా నాయకులు సభ ఏర్పాట్లలో జిల్లా నిమగ్నమయ్యారు. మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా నాయకుడు రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నగర అధ్యక్షుడు జావీద్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరులు ఆదివారం సూర్యాపేట వెళ్లి భట్టిని కలిశారు. ఈ వారితో మాట్లాడిన భట్టి సభ విషయమై పలు సూచనలు చేశారు. సభ తేది సోమవారం సాయంత్రం ఖరారవుతుందని, వచ్చేనెల 2 లేదంటే 3వ తేదీల్లో ఉండబోతోందన్నారు. అనంతరం ఖమ్మం చేరుకున్న నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర ఈనెల 28న ఖమ్మం చేరుతుందని, ముగింపుసభకు రాహుల్‌గాంధీ హాజరవుతారన్నారు. అదేరోజు ఇతరపార్టీల నుంచి నాయకుల చేరికలుంటాయని, భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర ముగింపు చిహ్నంగా ఖమ్మంరూరల్‌ మండలం పొన్నెకల్‌ వద్ద 20 అడుగులు పైలాన నిర్మించబోతున్నామని.. ఆ నమూనాను విడుదల చేశారు. అనంతరం సభ కోసం ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎనఆర్‌ కళాశాల మైదానంతో పాటు వైరారోడ్డు సమీపంలో, వైఎ్‌సఆర్‌నగర్‌రోడ్డులోని ఖాళీస్థలాలను పరిశీలించారు. మరోవైపు పొన్నకల్‌ వద్ద పైలాన పనులు చురుగ్గా సాగుతుండగా రాయల నాగేశ్వరరావు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా యువజనకాంగ్రెస్‌ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్‌, జిల్లా మైనార్టీ అధ్యక్షులు హుస్సెన పాల్గొన్నారు.

Updated Date - 2023-06-27T12:26:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising