ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

ABN, First Publish Date - 2023-06-07T00:20:12+05:30

అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో పాల్వంచ నవభారతలో నిర్వహించిన పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్‌ ఐపాస్‌ అమలుతో కొత్త పరిశ్రమల ఏర్పాటు పక్రియ సులభతరమైందన్నారు. ఈ టీఎస్‌ఐపాస్‌ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు రూ.22,956కోట్లతో 429యూనిట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు

కొత్తగూడెం/పాల్వంచ, జూన 6 (ఆంధ్రజ్యోతి): అవకాశాలను అందిపుచ్చుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో పాల్వంచ నవభారతలో నిర్వహించిన పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్‌ ఐపాస్‌ అమలుతో కొత్త పరిశ్రమల ఏర్పాటు పక్రియ సులభతరమైందన్నారు. ఈ టీఎస్‌ఐపాస్‌ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు రూ.22,956కోట్లతో 429యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయని, తద్వారా 11,099మందికి ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. టీ ఐడియా పథకం కింద రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి మార్చి నెల వరకు రూ.26.29కోట్ల రాయితీతో 274 మూనిట్లు మంజూరు చేశామని, జిల్లాలో ఇప్పటి వరకు ఎస్సీలు ఏర్పాటుచేసిన 368యూనిట్లకు రూ.24.06కోట్లు, ఎస్టీలకు చెందిన 1010యూనిట్లకు రూ.47.37కోట్లు, విభిన్న ప్రతిభావంతులకు చెందిన ఒక యూనిట్‌కు రూ.4లక్షలు రాయితీ మంజూరు చేశామన్నారు. కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బాణోత హరిప్రియ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తదుపరి విద్యా, ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక రంగం ఎంతో కీలకమన్నారు. కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ మాట్లాడుతూ ప్రగతిలో దిక్సూచిగా, ఆదర్శంగా ప్రతి రంగంలో ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. అలాగే సింగరేణి, బీటీపీఎస్‌, నవభారత, కేటీపీఎస్‌, బీపీఎల్‌ ద్వారా పెట్టుబడులు, ఉపాధి లభించినట్లు తెలిపారు. అనంతరం సీఎస్‌ఆర్‌ నిధులతో ప్రభుత్వ పా ఠశాలలకు డ్యూయల్‌ డెస్క్‌లు, బెంచీలు అందచేశారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడిన సంస్థల అధికారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజరు సీతారాం, ఎస్సీ కార్పోరేషన ఈడీ సంజీవరావు, కేటీపీఎస్‌ 5,6 దశల సీఈ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising