ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి వైద్యశాలకు ముస్కాన్‌ గుర్తింపు

ABN, First Publish Date - 2023-06-07T00:22:08+05:30

ఏజెన్సీ ప్రాంతంలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఇక్కడి నాణ్యత ప్రమాణాలను గుర్తించిన కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ముస్కాన్‌ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైద్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్‌ చౌహన్‌.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిజ్వి కి సమాచారం పంపగా.. ఆ సమాచారం భద్రాద్రి ఏరియా వైద్యశాల అధికారులకు మంగళవారం అందింది. డాక్టర్‌ జనీకా, డాక్టర్‌ సంజూలతాలతో కూడిన బృందం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరోసారి దక్కిన జాతీయస్థాయి ధ్రువీకరణ

భద్రాచలం జూన్‌ 6: ఏజెన్సీ ప్రాంతంలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఇక్కడి నాణ్యత ప్రమాణాలను గుర్తించిన కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ముస్కాన్‌ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైద్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్‌ చౌహన్‌.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిజ్వి కి సమాచారం పంపగా.. ఆ సమాచారం భద్రాద్రి ఏరియా వైద్యశాల అధికారులకు మంగళవారం అందింది. డాక్టర్‌ జనీకా, డాక్టర్‌ సంజూలతాలతో కూడిన బృందం ఏప్రిల్‌ 21, 22 తేదీల్లో భద్రాచలం ఏరియా వైద్యశాలను సందర్శించింది. ఈ క్రమంలో వారు పీడియాట్రిక్‌ ఔట్‌ పేషెంట్‌, ఇన్‌ పేషెంట్‌ విభాగాలు, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, పోషకాహార కేంద్రాలను పరిశీలించారు. శిశువులకు, చిన్నారులకు అందుతున్న వైద్య ేసవలను తెలుసుకున్నారు. ఈ నాలుగు విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముస్కాన్‌ నాణ్యత స్థాయి భద్రాద్రి వైద్యశాలలోనూ ఉందని గుర్తించి సర్టిఫికెట్‌ను జారీ చేశారు. గతంలో కూడా భద్రాది ఏరియా వైద్యశాలకు కాయకల్ప, నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ సర్టిఫికెట్‌ రాగా.. ప్రసవాల్లో పలుమార్లు రాష్ట్రస్థాయి ప్రథమం, ఉత్తమ నవజాత శిశు సంరక్షణ కేంద్రంగా ఎంపికైంది. ఈ క్రమంలో మరోసారి ముస్కాన్‌ నాణ్యత స్థాయికి ఎంపికవడం పట్ల సర్వత్ర హర్షం వ్యకమవుతోంది. అందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని, పీడియాట్రిక్‌ విభాగంలో నాలుగు అంశాలలో సర్టిఫికెట్‌ను సాధించడంతో రూ.8 లక్షలు చొప్పున మూడేళ్ల పాటు కేంద్రం నుంచి నిదులు రానున్నాయని భద్రాచలం ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రామకృష్ణ తెలిపారు. మరోవైపు వైద్యశాల నిర్వాహక కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా హర్షం వ్యక్తం చేశారు. భద్రాచలం వైద్యశాల వివిధ విభాగాల్లో రాష్ట్ర జాతీయస్థాయిలో తన ఖ్యాతిని చాటుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికేౖనా ప్రభుత్వం వైద్యులు సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేసి కార్పొరేట్‌ వైద్యం ఏజెన్సీలోని నిరుపేదల అందరికీ మరింతగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-06-07T00:22:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising