ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ

ABN, First Publish Date - 2023-05-02T23:51:37+05:30

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంగళవారం ప్రముఖ సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఖమ్మం లకారం ట్యాంకుబండ్‌లో ఏర్పాటు చేయనున్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడిరాష్ట్ర మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామా

జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, దర్శకుడు కొరటాల శివ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

28న ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు ఆహ్వానం

ఖమ్మం, 2 (ఆంధ్రజ్యోతి) : రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంగళవారం ప్రముఖ సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఖమ్మం లకారం ట్యాంకుబండ్‌లో ఏర్పాటు చేయనున్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడిరాష్ట్ర మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావు 54అడుగుల శ్రీకృష్ణావతారంలోని భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఆహ్వానం పలికారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఈ నెల 28న విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా.. ఆ విగ్రహ నమూనా, నిర్మాణ వివరాలను మంత్రి పువ్వాడ ఎన్టీఆర్‌కు వివరించారు. మంత్రి వెంట సినీ దర్శకుడు కొరటాల శివ, విగ్రహ శిల్పి ప్రతాప్‌వర్మ ఉన్నారు. 36అడుగుల వెడల్పు, పొడువు ఉండే బేస్‌మెంట్‌తో కలిపి ఈ విగ్రహం ఎత్తు 54 అడుగులు ఉండనుండగా.. దీని కోసం రూ.2.30కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన శిల్పి ప్రతాప్‌వర్మ తీర్చిదిద్దుతున్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నిజామాబాద్‌ నుంచి ఖమ్మానికి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-02T23:51:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising