గడ్చిరోలీలో మావోయిస్టుల విధ్వంసం
ABN, First Publish Date - 2023-03-03T23:03:21+05:30
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు శుక్రవారం విధ్వంసం సృష్టించారు.
చర్ల, మార్చి 3: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు శుక్రవారం విధ్వంసం సృష్టించారు. రోడ్లు నిర్మాణ పనులకు వినియోగిస్తున్న మూడు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘనటలో సుమారు రూ.30లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. గడ్చిరోలి జిల్లా ఈటపల్లి అటవీప్రాంతంలో రహదారి పనులు జరుగుతుండగా.. శుక్రవారం అక్కడికి చేరుకున్న మావోయిస్టులు ఒక ప్రొక్లెయినర్, ఒక ట్రాక్టర్, ఒక కాంక్రీట్ మిక్సింగ్ వాహనానికి నిప్పు పెట్టడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో రహదారిపనులు నిలిచిపోగా.. అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. అలాగే కొద్ది రోజుల క్రితం ఇదే జిల్లాలో మావోయిస్టులు రహదారిపనులు చేస్తున్న వాహనాలకు నిప్పుపెట్టగా అప్పుడు కూడా భారీగా ఆస్తినష్టం జరిగింది. ఈ రెండు ఘటనలు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగాయి.
Updated Date - 2023-03-03T23:03:21+05:30 IST