ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్వచ్ఛసర్వేక్షణ్‌’లో దేశంలోనే ఖమ్మం ఫస్ట్‌

ABN, First Publish Date - 2023-02-02T01:17:28+05:30

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ ర్యాంకింగుల్లో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలు సత్తాచాటాయి. గతేడాది డిసెంబరు 1వ తేదీ వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం 2023 స్వచ్ఛసర్వేక్షణ్‌ ర్యాంకులను బుధవారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి జిల్లాకు ఐదోస్థానం

ఖమ్మంసంక్షేమవిభాగం, ఫిబ్రవరి 1 : స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ ర్యాంకింగుల్లో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలు సత్తాచాటాయి. గతేడాది డిసెంబరు 1వ తేదీ వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం 2023 స్వచ్ఛసర్వేక్షణ్‌ ర్యాంకులను బుధవారం ప్రకటించింది. కేంద్ర జలశక్తి శాఖ.. దేశవ్యాప్తంగా మొత్తం 44పట్టణాలకు త్రీస్టార్‌ రేటింగ్‌ ఇవ్వగా.. అందులో 187.35శాతం మార్కులతో ఖమ్మం జిల్లా దేశంలోనే మొదటిస్థానాన్ని కైవసం చేసుకోగా.. 122.57మార్కులతో భద్రాద్రి జిల్లా ఐదోస్థానంలో నిలిచింది. స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఖమ్మం జిల్లాకు ప్రథమస్థానం రావడం పట్ల జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మేరుగు విద్యాచందన బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీల నిర్వహణలో ఖమ్మం జిల్లా దేశంలోనే ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందన్నారు.

Updated Date - 2023-02-02T01:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising