ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలహంసపై కౌసల్యరాముడు

ABN, First Publish Date - 2023-01-02T00:24:53+05:30

అధ్యయనోత్సవ వేళ.. అశేష భక్తవాహిని రామనామ స్మరణ, బాణసంచా వెలుగుల మధ్య ఆ కౌసల్యరాముడు గోదావరిలో కలహంసపై విహరించాడు. ఆనావాయితీ ప్రకారం ముక్కోటి ఏకాదశి ముందురోజున ఆదివారం గోదావరిలో శ్రీరామచంద్రులకు నిర్వహించిన తెప్పోత్సవం వైభవంగా సాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిలకిస్తున్న భక్తులు

భద్రాద్రిలో శోభాయమానంగా తెప్పోత్సవం

గోదావరిలో సీతారాముల నదీ విహారం

భక్తులతో కిటకిటలాడిన కరకట్ట

భద్రాచలం, జనవరి 1: అధ్యయనోత్సవ వేళ.. అశేష భక్తవాహిని రామనామ స్మరణ, బాణసంచా వెలుగుల మధ్య ఆ కౌసల్యరాముడు గోదావరిలో కలహంసపై విహరించాడు. ఆనావాయితీ ప్రకారం ముక్కోటి ఏకాదశి ముందురోజున ఆదివారం గోదావరిలో శ్రీరామచంద్రులకు నిర్వహించిన తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు భద్రాద్రికి తరలిరాగా.. సాయంత్రం 4.15గంటలకు సీతారామచంద్రలక్ష్మణ స్వాములను ఆయలం నుంచి పల్లకీలో భాజాభజంత్రాల మధ్య గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చారు. 4.50కిస్వామి వారిని హంసాలంకృత వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆరు గంటల సమయంలో హంసపాన్పుపై ఆశీనులను చేసిన తరువాత తెప్పోత్సవం ప్రారంభమైంది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యాలు మోగుతుండగా.. బాణసంచా శబ్దాలు, వెలుగులు విరజిమ్ముతుండగా.. స్వామివారు నదీ విహారం చేశారు. రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం ముగియగా.. స్వామివారిని ఆలయానికి తీసుకొచ్చే క్రమంలో భద్రాద్రి కరకట్ట, వీధులు భక్తులతో కిటకటలాడాయి.

పులకరించిన గౌతమీ తీరం

కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో గత రెండేళ్లు ముక్కోటి ఏకదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతించలేదు. కానీ ఈ ఏడాది భక్తులను అనుమతించడంతో భద్రాచలానికి భక్తులు పోటెత్తారు. కరకట్టతో పాటు గోదావరి ఇసుక తెన్నెలు భక్తులతో కిటకిటలాడాయి. ఇక తెప్పోత్సవ సమయంలో భక్తుల శ్రీరామ నామస్మరణ, జై శ్రీరామ్‌ నినాదాలతో నదీ తీరం మారుమోగింది. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కలెక్టర్‌ అనుదీప్‌, ఎస్పీ డాక్టర్‌ వినీత, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అడిషనల్‌ ఎస్పీ సాయిమనోహర్‌, ఏఎస్పీ రోహితరాజ్‌, ఆర్డీవో ఆర్‌. రత్నకల్యాణి, తహసీల్దార్‌ శ్రీనివాస యాదవ్‌, డీఎంహెచవో డాక్టర్‌ శిరీష, దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఈవో శ్రావణ్‌కుమార్‌, పర్యవేక్షకులు కత్తి శ్రీనివా్‌స్‌, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన, ఉపప్రధాన అర్చకులు అమరవాది శ్రీనివాస రామానుజం, ముఖ్య అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, వేద పండితులు, పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.

నేడు ఉత్తరద్వారంలో రామయ్య దర్శనం

ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాద్రి రామయ్య సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఉత్తరద్వారంలో దర్శనమిస్తారు. గరుఢవాహనంపై కొలువుదీరనున్న స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇక కంచర్ల గోపన్న పాల్వంచ పరగణాకు తహసీల్దారుగా ఉన్న కాలం నుంచి వస్తున్న సంప్రదాయంలో భాగంగా స్థానిక తహసీల్దార్‌ ప్రత్యేక అభిషేకం నిర్వహించిన అనంతరమే స్వామివారిని ఉత్తరద్వారం వైపు తీసుకురానున్నారు.

ఆనలైనలో 1,444, ఆఫ్‌లైన్‌లో 955టికెట్ల విక్రయం

ఉత్తరద్వార దర్శనాన్ని తిలకించేందుకు భక్తులు ఆనలైనలో 1,444 టికెట్లు, ఆఫ్‌లైనలో 955 టికెట్లు కొనుగోలు చేశారు. ఆదివారం వరకు రూ.2వేల వీఐపీ టికెట్లు ఆనలైనలో 700కు గాను 580, ఆఫ్‌లైనలో 70కు గాను 575టికెట్లు విక్రయించినట్లు సమాచారం.

Updated Date - 2023-01-02T00:24:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising