జమలాపురంలో భక్తుల రద్దీ
ABN, First Publish Date - 2023-01-14T23:55:57+05:30
జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భోగి పండుగ సందర్భగా భక్తుల రద్దీ నెలకొంది.
ఎర్రుపాలెం, జనవరి14: జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భోగి పండుగ సందర్భగా భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున శ్రీవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో సుప్రభాతసేవ నిర్వహించి, పంచామృతాలతో, సుగంధద్రవ్యాలతో సర్వాంగాభిషేకం, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ప్రతిష్టాస్వామికి నూతనపట్టు వస్ర్తాలు ధరింపచేసి దర్శనం కలిగించారు. అలవేలు మంగ, పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగింపు చేసి కళ్యాణ వేదిక వద్ద చేర్చి వైభవంగా నిత్య కళ్యాణం జరిపిం చారు. భోగి పండుగ కావడంతో భక్తులు అధికసం ఖ్యలో పాల్గొన్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్ధప్రసాదాలు, ఉచిత అన్నదాన వితరణ ఏర్పాటు చేశారు కార్యక్రమాల్లో వ్యవస్థాఫక ధర్మకర్త ఉప్పల కృష్ణమోహనశర్మ, ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ విజయకుమారి, పాల్గొన్నారు.
Updated Date - 2023-01-14T23:55:58+05:30 IST