ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి

ABN, First Publish Date - 2023-03-18T23:50:20+05:30

విద్యుతతీగలు ఆ దంపతుల ప్రాణాలను బలిగొన్నాయి. మేకలు కాసేందుకు వెళ్లిన వారు విగతజీవులై కనిపించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలో శనివారం జరిగింది.

ఘటనాస్థలంలో రాములు, రంగమ్మ మృతదేహాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మేకలను మేపేందుకు వెళ్లిన క్రమంలో ఘటన

వందనంలో విషాదం

చింతకాని, మార్చి 18: విద్యుతతీగలు ఆ దంపతుల ప్రాణాలను బలిగొన్నాయి. మేకలు కాసేందుకు వెళ్లిన వారు విగతజీవులై కనిపించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలో శనివారం జరిగింది. వందనం గ్రామానికి చెందిన బాణోత రాములు (65), రంగమ్మ (60) దంపతులు మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారికి ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లున్నారు. ఎప్పటిలాగానే శనివారం వారు మేకలను గ్రామ సమీపంలోని పొలాల్లో మేతకు తోలుకెళ్లారు. చీకటిపడినా వారు ఇంటికి తిరిగిరాకపోవడం, మేకలు మాత్రమే రావడంతో కంగారు పడిన వారి చిన్న కూతురు ఇరుగు పొరుగు వారితో కలసి సమీప పొలాల్లో వెతికింది. ఈ క్రమంలో ఓ రైతు సుబాబుల్‌ పొలం వద్ద విగతజీవులుగా కనిపించారు. శుక్రవారం రాత్రి అకాల గాలివానకు వ్యవసాయ విద్యుతలైన్‌ తెగిపడగా.. దానిని గుర్తించని రాములు, రంగమ్మ దంపతులు ప్రమాదవశాత్తు వాటికి తగిలి మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Updated Date - 2023-03-18T23:50:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising