ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటింటికి సంక్షేమ పథకాలు

ABN, First Publish Date - 2023-02-21T00:29:03+05:30

ఇంటింటికి సంక్షే మ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో రఘునాథపాలెం మండలం రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా నిలుస్తోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభివృద్ధిలో రాష్ట్రానికి రోల్‌మోడల్‌గా రఘునాథపాలెం మండలం

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

రూ.1.13కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం

రఘునాథపాలెం, ఫిబ్రవరి 20: ఇంటింటికి సంక్షే మ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో రఘునాథపాలెం మండలం రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా నిలుస్తోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం రఘునాథపాలెం మండలంలోని మల్లేపల్లి, రాములతండా, బావోజీతండా, జింకలతండా, పరికలబోడుతండా గ్రామాల్లో విస్త్రతంగా పర్యటించారు. ఎనఆర్‌ఈజీఎ్‌స, ఇతర నిధులు రూ.1.13కోట్లతో పూర్తిచేసిన 30పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం రఘునాథపా లెం రైతువేదికలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద లబ్ధిదారులకు మంజూరైన రూ.70 లక్షల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రఘనాథపాలెం మండలంలో ఒక్క మట్టి రోడ్డు లేకుండా సీసీ రహదారులుగా నిర్మాణం పూర్తిచేశామన్నారు. 17గ్రామ పంచాయతీలను 36కు పెంచామని, దశల వారీగా వాటికి భవనాలను నిర్మిస్తున్నామన్నారు. రఘునాథపాలెం క్రాస్‌రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలు, గోడౌన్లు, రైతు వేదికలు ఏర్పాటు చేసి మోడల్‌ మండలంగా తీర్చిదిద్దామన్నారు. మండలంలో మరో 7వేల మందికి ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని, గత ఎన్నికల్లో రఘునాథపాలెం మండల ప్రజల దీవెనలతోనే తాను గెలిచానని, ఆ ఆశీస్సులు తనకు ఎల్లప్పుడు ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు అండగా ఉండి మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రి చేయాలన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మాలోత గౌరి, తహసీల్దార్‌ నర్సింహారావు, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T00:29:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising