ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆ ఎన్నెస్పీ స్థలానికి హద్దుల నిర్ధారణ

ABN, First Publish Date - 2023-09-27T00:07:27+05:30

ఖమ్మం నగరంలోని బుర్హానపురం రెవెన్యూ పరిధిలోని రమణగుట్ట సమీపంలో ఎన్నెస్పీకి చెందిన భూములకు మంగళవారం అధికారులు హద్దులు నిర్ధారించారు. బుర్హానపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 55/1లో 0.19 కుంటలు, 57/ఆ

ఖమ్మం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం నగరంలోని బుర్హానపురం రెవెన్యూ పరిధిలోని రమణగుట్ట సమీపంలో ఎన్నెస్పీకి చెందిన భూములకు మంగళవారం అధికారులు హద్దులు నిర్ధారించారు. బుర్హానపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 55/1లో 0.19 కుంటలు, 57/ఆలో 0.37కుంటలు, 59/ఆ/1లో 0.33, 59/ఇలో 1.13ఎకరాల ఎన్నెస్పీ భూమి ఉండగా.. ఆయా భూములను కొందరు అక్రమార్కులు ప్లాట్లుగా చేసి విక్రయించారు. సంబంధిత ఎన్నెస్పీ భూమికి చెందిన సర్వే నెంబర్లు రిజిసే్ట్రషన కార్యాలయంలో నిషేధిత జాబితాలో లేకపోవడంతో అక్కడి 57/ఆలో పెద్దఎత్తున రిజిసే్ట్రషన్లు జరగాయి. కాగా దానిపై మూడెకరాలు మింగేశారు శీర్షికన అక్కడి భూములకు సంబంధించి రిజిసే్ట్రషన్లు జరిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. దానికి స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే హద్దులు పెట్టి పూర్తి విచారణ చేయాలని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా మంగళవారం ఖమ్మం అర్బన రెవెన్యూ అధికారులు, ఎన్నెస్పీ శాఖ వారు కలిసి సదరు భూమికి హద్దులను నిర్ధారించుకున్నారు. అనంతరం దానికి సంబంధించి విచారణ పూర్తిచేసి తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. సర్వే నిర్వహించిన వారిలో అర్బన ఆర్‌ఐ రవి, సర్వేయర్‌ లక్ష్మణ్‌, నీటిపారుదల శాఖ ఏఈ వెంకటేశ్వర్లు ఉన్నారు.

Updated Date - 2023-09-27T00:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising