కారుణ్య నియామక పత్రాల అందజేత
ABN, First Publish Date - 2023-02-15T22:53:24+05:30
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో విధులు నిర్వహిస్తూ మెడికల్ అన్‌ఫిట్ పొందిన ఐదుగురు కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకం కింద నియామక పత్రాలను బుధవారం ఏరియా జీఎం డి రాంచందర్ అందజేశారు.
మణుగూరుటౌన్, ఫిబ్రవరి 15: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో విధులు నిర్వహిస్తూ మెడికల్ అన్‌ఫిట్ పొందిన ఐదుగురు కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకం కింద నియామక పత్రాలను బుధవారం ఏరియా జీఎం డి రాంచందర్ అందజేశారు. సింగరేణిలో ఉపాధి పొందిన వారు సంస్ధ అభివృద్దికి తమ సంపూర్ణ సహాకారం అందించాలన్నారు. కష్టపడి పని చేసి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా జీఎం వారికి సూచించారు. సింగరేణి సంస్ధలో ఉద్యోగం దొరకడం అదృష్టమని, ఉద్యోగంతో ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకో వాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం లలిత్ కుమార్, పికెఓసీ పీవో లక్ష్మిపతి గౌడ్, అధికార ప్రతినిధి రమేష్, అఽధికారులు శ్రీనివాస మూర్తి, సింగు శ్రీనివాస్, అనురాధ, యూనియన్ నాయకులు కాపా శివాజీ పాల్గొన్నారు.
Updated Date - 2023-02-15T22:53:28+05:30 IST