ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఆర్‌ఎ్‌సకు దయానంద్‌ గుడ్‌బై

ABN, First Publish Date - 2023-05-27T00:02:31+05:30

సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నేత డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయకుమార్‌, ఆయన సతీమణి డాక్టర్‌ రాగమయి బీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెప్పారు. శుక్రవారం వారు తమ ముఖ్య అనుచరులతో కలిసి హైదరాబాద్‌ వెళ్లి గాంధీభవనలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌లో చేరిన దయానంద్‌, రాగమయి దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సతీమణితో కలిసి రేణుకాచౌదరి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరిన దయానంద్‌

గాంధీభవన్‌లో కండువా కప్పిన మాణిక్‌రావ్‌ ఠాక్రే

సత్తుపల్లి, మే 26 : సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నేత డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయకుమార్‌, ఆయన సతీమణి డాక్టర్‌ రాగమయి బీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెప్పారు. శుక్రవారం వారు తమ ముఖ్య అనుచరులతో కలిసి హైదరాబాద్‌ వెళ్లి గాంధీభవనలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మానిక్‌రావ్‌ ఠాక్రే పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం వారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత రెడ్డిని కలవగా.. ఆయన వారిని అభినందించారు. దయానంద్‌వెంట ఆత్మ మాజీ చైర్మన నున్నా రామకృష్ణ తదితరులున్నారు.

సొంత పార్టీలోకి మట్టా దంపతులు

2013కు పూర్వం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న డాక్టర్‌ మట్టా దయానంద్‌ తిరిగి పదేళ్లకు సొంత పార్టీలో చేరారు. 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున సత్తుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన దయానంద్‌ స్వల్ప తేడాతో అప్పటి టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ముందుకు సాగి.. 2016లో బీఆర్‌ఎ్‌సలో చేరారు. 2018లో పార్టీ నుంచి టిక్కెట్‌ ఆశించినా ఫలితం లేకపోయింది. ఆ తరువాత బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఎమ్మెల్సీ, కార్పొరేషన చైర్మన పదవి ఇస్తామంటూ కాలం వెళ్లదీసిందే తప్ప ఉపయోగం లేదని దయానంద్‌ వాపోయారు. బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగితే భవిష్యత్తు లేదని భావించిన ఆయన కాంగ్రె్‌సలో చేరారు.

ఆశచూపినా కాంగ్రెస్‌ వైపే అడుగులు

దయానంద్‌ బీఆర్‌ఎస్‌ వీడిపోనున్నారనే ప్రచారంతో బీఆర్‌ఎ్‌సకు చెందిన కొందరు ప్రముఖులు ఆయనతో చర్చలు జరిపినట్టు ప్రచారం జరిగింది. పార్టీలో కొనసాగితే కార్పొరేషన చైర్మన ఇప్పిస్తామంటూ ఆఫర్‌ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా పార్టీని వీడాలని దయానంద్‌ నిర్ణయించుకోని కాంగ్రెస్‌లో చేరారు.

పొంగులేటితో భేదాభిప్రాయాలు

2014 నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్న డాక్టర్‌ మట్టా దయానంద్‌ కొంతకాలంగా పొంగులేటితో దూరంగా ఉన్నారు. బీఆర్‌ఎ్‌సపై ధిక్కార స్వరం వినిపించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలుత బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరగ్గా.. ఆయనతో కలిసి బీజేపీలోకి వెళ్లేందుకు దయానంద్‌ సుముఖత చూపలేదు. దీంతో ఇద్దరి మఽధ్య రాజకీయంగా భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ నుచిఇ బహిష్కరణకు గురైన పొంగులేటి తన ప్రయాణం ఎటువైపు అనేది నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తుండటంతో.. డయానంద్‌ దంపతులు పొంగులేటి శిబిరం నుంచి బయటకు వచ్చి సొంతంగా కాంగ్రె్‌సలో చేరారు.

Updated Date - 2023-05-27T00:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising