తునికాకు బోనస్ వెంటనే చెల్లించాలి
ABN, First Publish Date - 2023-03-02T23:07:04+05:30
నియోజకవర్గంలో తునికాకు సేకరణ , ఫ్రూనింగ్ పనులను వెంటనే చేపట్టాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ డా. మిడియం బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భద్రాచలం, మార్చి 2: నియోజకవర్గంలో తునికాకు సేకరణ , ఫ్రూనింగ్ పనులను వెంటనే చేపట్టాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ డా. మిడియం బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం భద్రాచలం పట్టణ కమిటీ సమావేశం ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన జరగ్గా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గిరిజన గిరినేతర పేదలకు వేసవి పంటగా ఆర్దికంగా ఉపయోగపడుతు న్న తునికాకు సేకరణకు సంబంధించిన మండకొట్టుట, ప్రూనింగ్ పనులను వెం టనే చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో 2017 నుంచి చెల్లించవలసిన తునికాకు బోనసు చెక్కులను నేరుగా తునికాకు కార్మికులకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు స్వామి, శరత్‌బాబు, గంగా, వై. వెంకట రామారావు, సంతోష్‌కుమార్, లీలావతి, మాధవరావు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T23:07:04+05:30 IST