ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కంటివెలుగు’ ఏర్పాట్లు పరిశీలించిన కమీషనర్‌ శ్వేత మహంతి

ABN, First Publish Date - 2023-01-18T00:08:28+05:30

అంధత్వం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండోవిడత కార్యక్రమ ప్రారంభానికి సర్వం సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు, ఉత్తర ప్రదేశ మాజీ సీఎం తదితరులు ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్‌ భవన ప్రారంభం, అనంతరం జరిగే కంటివెలుగు ప్రారంభానికి హాజరవుతారు. ఈ సందర్భంగా అక్కడ చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేత మహాంతి మంగళవారం పరిశీలించారు. కేంద్రాల వద్ద ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలుండాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్‌వో బి.మాల

. సమీకృత కలెక్టరేట్‌లో సీఎం ప్రారంభించనున్న కంటివెలుగు కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్‌ శ్వేత మహంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం కలెక్టరేట్‌, జనవరి 17 : అంధత్వం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండోవిడత కార్యక్రమ ప్రారంభానికి సర్వం సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు, ఉత్తర ప్రదేశ మాజీ సీఎం తదితరులు ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్‌ భవన ప్రారంభం, అనంతరం జరిగే కంటివెలుగు ప్రారంభానికి హాజరవుతారు. ఈ సందర్భంగా అక్కడ చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేత మహాంతి మంగళవారం పరిశీలించారు. కేంద్రాల వద్ద ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలుండాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్‌వో బి.మాలతి, డిప్యూటీ డీఎంహెచవో రాంబాబును కమిషనర్‌ ఆదేశించారు. వైద్యాధికారులు, ఏఎనఎంలు, ఆశాకార్యకర్తల సమక్షంలో ఎంపిక చేసిన వేపకుంట్లకు చెందిన అనుబోతురామనాథం, ధీరావత పిచ్చమ్మ, ఆవుల వెంకటేశ్వరమ్మ, అమరనేని వెంకటేశ్వర్లు, గౌసియాబేగం, కోలెం జ్యోతిలకు కంటి పరీక్షల మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. వీరికి సీఎంలు, అతిథులు కళ్లద్దాలను అందజేయనున్నారు. ఈ వేదిక వద్ద గత కంటివెలుగు కార్యక్రమానికి సంబంధించిన చిత్రప్రదర్శనను ఏర్పాటు చేయించారు. ఇక జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు.

Updated Date - 2023-01-18T00:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising