ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏఎస్పీ

ABN, First Publish Date - 2023-01-06T22:43:55+05:30

భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను భద్రాచలం ఎఎస్‌పీ రోహిత్‌రాజ్‌ శుక్రవారం ప్రారంభించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్పీ రోహిత్‌ రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం, జనవరి 6: భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను భద్రాచలం ఎఎస్‌పీ రోహిత్‌రాజ్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఎస్‌పీ మాట్లాడు తూ ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, దొంగతనాల కేసులను చేధించడంలో, దొంగతనాలు జరగకుం డా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఇటీవల పోలీసులు చేధించిన కొన్ని కేసులే ఉదాహరణ అని అన్నారు. నేను సైతం లో భాగంగా హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌, భద్రాద్రి మిని హో టల్‌ అసోసియేషన్‌ వారి సహకారంతో సీసీ కెమెరాలను కొన్ని చోట్ల ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణంలో 110 సీసీ కెమెరాలు పోలీసుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నా యని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పా టుకు చొరవ చూపాలని కోరారు. సీసీ కెమెరాల వల్ల నేరాల పరిశోధన వేగంగా జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ దిశగా అందరూ సమాయత్తం కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగరాజు రెడ్డి, హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సిందా, కల్కి వాసు, పోలీసు కానిస్టేబుల్‌ శెట్టి శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-06T22:43:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising