ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందుకు సాగని బీటీపీఎస్‌ రైల్వే ట్రాక్‌ పనులు

ABN, First Publish Date - 2023-03-05T00:32:03+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన రైల్వేలైన పనులు ముందకు సాగడం లేదు. సుమారు రూ.300కోట్లతో ఈ పనులను ప్రారంభించగా కొన్ని ప్రాంతాల్లోనే పనులు చేపట్టారు. భూ సేకరణ పెద్ద సమస్యగా తలెత్తడంతో కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ముందుగా భూసేకరణ చేసిన అధికారులు 180 ఎకరాలను గుర్తించారు.

నత్తనడకన సాగుతున్న రైల్వే ట్రాక్‌ పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భూసేకరణే సమస్య అంటున్న కాంట్రాక్టర్‌

సరైన పరిహారమిస్తేనే భూములిస్తామంటున్న నిర్వాసితులు

మణుగూరు రూరల్‌, మార్చి 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన రైల్వేలైన పనులు ముందకు సాగడం లేదు. సుమారు రూ.300కోట్లతో ఈ పనులను ప్రారంభించగా కొన్ని ప్రాంతాల్లోనే పనులు చేపట్టారు. భూ సేకరణ పెద్ద సమస్యగా తలెత్తడంతో కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ముందుగా భూసేకరణ చేసిన అధికారులు 180 ఎకరాలను గుర్తించారు. 21 కిలోమీటర్ల మేరకు రైల్వేలైన నిర్మించాలని ప్రతిపాధనలు సిద్ధం చేశారు. అయితే పనులు ప్రారంభం అయ్యాక రామానుజవరం, విప్పల సింగారం తదితర గ్రామాలను చెందిన నిర్వాసితులు తమకు సరైన పరిహారం చెల్లిస్తేనే భూములు అప్పగిస్తామని రైల్వే పనులను అడుకుంటున్నారు. రామానుజవరం రైతులు ఏకంగా ఆందోళనకు దిగారు. పోలీసు యంత్రాంగం మోహరించినా భారీగా ధర్నా, రాస్తారోకోలు చేపట్టారు. దీంతో అక్కడ రైల్వే లైన పనులకు బ్రేక్‌ పడింది. తమ భూములను సేకరించిన అధికారులు పరిహారం విషయంలో తమకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టేను పొందారు. కొన్ని ప్రాంతాల్లో ఈ కారణంగా పనులు నిలిచిపోయాయి. పనులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నా భూ సేకరణ సమస్యే పెద్ద సమస్యగా మారిందని కాంట్రాక్టర్ల ప్రతినిధులు పేర్కొంటుండగా, పూర్తి స్ధాయినష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు భూములు అప్పగించేది లేదంటూ నిర్వసితులు బాహాటంగా పేర్కోంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేగాతో పాటు పోలీసు రెవెన్యూ యంత్రాంగం సుదీర్ఘంగా చర్చలు జరపగా తహసీల్దార్‌ నాగరాజు రైతులతో ఒప్పించే ప్రయత్నాలు చేశారు. అయినా నిర్వాసితులు అంత సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. అధికార యంత్రాంగం దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప రైల్వేట్రాక్‌ పనులు ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు.

కోర్టు స్టే తొలగింపునకు ప్రయత్నిస్తున్నాం

నాగరాజు, మణుగూరు తహసీల్దార్‌

భూనిర్వాతులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపాం. చట్టప్రకారం నష్టపరిహరం చెల్లిస్తామని తేల్చి చెప్పాం.. కొందరు రైతులు హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారు. దాని తొలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ అడ్డంకి తొలిగితే పనులు ప్రారంభిస్తాం.

Updated Date - 2023-03-05T00:32:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising