ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హ్యాట్రిక్‌ సాధించనున్న కేసీఆర్‌

ABN, First Publish Date - 2023-10-06T01:18:22+05:30

ప్రజాశీర్వాదంతో అధికారాన్ని సాధించి సీ ఎంగా కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హ్యాట్రిక్‌ సాధించనున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు.

పేరేపల్లిలో అంగనవాడీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్యెల్యే చిరుమర్తి

హ్యాట్రిక్‌ సాధించనున్న కేసీఆర్‌

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాలరూరల్‌, చిట్యాల, అక్టోబరు 5: ప్రజాశీర్వాదంతో అధికారాన్ని సాధించి సీ ఎంగా కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హ్యాట్రిక్‌ సాధించనున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. మండలంలోని వనిపాకల, తా ళ్లవెల్లంల, చిన్నకాపర్తి, పేరేపల్లి, గుండ్రాంపల్లి గ్రామాల్లో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీపీ కొలను సునీత, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, సర్పంచులు మేడి లింగమ్మ, బోయపల్లి వాణి, రత్నంపుష్పమ్మలతో కలిసి ప్రా రంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మాట్లాడుతూ దళితబంధు పథకం ద్వారా ఇంటికి రూ.10లక్షలు ఇ చ్చే మొనగాడు దేశంలో ఎవరైనా ఉన్నారా అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. అనంత రం బతుకమ్మ చీరలు, కీడా సామగ్రిని పంపిణీ చేసి మాట్లాడారు. అభివృద్ధి అంటే ఏమిటో రా ష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేసి చూపించారని అన్నా రు. కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రోడ్లు భవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. మహిళలకు పుట్టించి కానుకగా బతుకమ్మ పం డుగకు చీరలను పంపిణీ చేస్తుంది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల మ న్ననలను పొందుతూ మరింత అభివృద్ధి సం క్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు. రాష్ట్రంలో మరిని అ భివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందించాలంటే ప్రజలందరూ బీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు అత్యధికంగా ఓట్లు వేయాలని, తనను అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. చిట్యాల మునిసిపాలిటీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివన్నారు. చిట్యాల మండలంలో గురువారం క్షణం తీరిక లేకుండా గ్రామాల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సుడిగాలి పర్యటన చేశారు. భోజనం చేసే సమయం లేక ఊరి చివరన వ్యవసాయ పొలం వద్ద సాదాసీదాగా భోజనం చేసి తాను కూడా ఒక సామాన్యుడినేనని నిరూపించాడు ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మునిసిపల్‌ చైర్మన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన జడల ఆదిమల్ల య్య, మునిసిపల్‌ వైస్‌చైర్మన కూరెల్ల లింగస్వా మి, మెండె సైదులు, పొన్నం లక్ష్మయ్య, వనమా వెంకటేశ్వర్లు, చంద్రకాంత, కౌన్సిలర్లు, ఆయా కా ర్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-06T01:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising