ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గద్దర్‌ను 3 గంటలు ఎండలో నిలబెట్టిన కేసీఆర్‌

ABN, First Publish Date - 2023-08-09T03:16:46+05:30

ప్రజా యుద్ధనౌక గద్దర్‌ బతికి ఉన్నప్పుడు ఆయనను కలవడానికి కూడా సీఎం కేసీఆర్‌ ఇష్టపడకుండా అవమానించారని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి తెలిపారు.

బతికి ఉన్నప్పుడు అవమానించారు.. చనిపోయాక ఇంటికెళ్లి ఓట్ల వేట

ట్విటర్‌లో ఆకునూరి మురళి విమర్శలు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ప్రజా యుద్ధనౌక గద్దర్‌ బతికి ఉన్నప్పుడు ఆయనను కలవడానికి కూడా సీఎం కేసీఆర్‌ ఇష్టపడకుండా అవమానించారని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి తెలిపారు. కానీ, చనిపోయాక ఆయన ఇంటికివెళ్లి ఓట్ల వేట మొదలుపెట్టారని ఆరోపించారు. ఈ మేరకు కేసీఆర్‌ తీరును తప్పుబడుతూ ట్వీట్‌ చేశారు. ‘‘గద్దరన్న కేసీఆర్‌ను కలవడానికి రెండుసార్లు ప్రయత్నం చేసిండు. 2023 ఫిబ్రవరి 28న ప్రగతిభవన్‌ వద్దకు వెళ్లి కేసీఆర్‌ను కలవడానికి అనుమతి కోరిండు. మూడు గంటలపాటు గేటు దగ్గర ఎండలో కూర్చున్నడు. అయినా కేసీఆర్‌ కలవలేదు. బతికి ఉన్నప్పుడు కలవడానికి ఇష్టపడకుండా అవమానించిండు. చనిపోయాక అధికార లాంఛనాలు అని గద్దరన్న ఇంటికిపోయి.. ఓట్ల వేట మొదలుపెట్టిండు’’ అని ట్విటర్‌లో మురళి విమర్శించారు.

Updated Date - 2023-08-09T03:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising