ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్‌

ABN, First Publish Date - 2023-08-22T04:37:03+05:30

ఉద్యోగ నియామకాలంటూ సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆరోపించారు.

బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి జావడేకర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ నియామకాలంటూ సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆరోపించారు. ఆయన కుటుంబంలో మాత్రం కేటీఆర్‌, హరీష్‌, కవిత, సంతో్‌షలకు ఉద్యోగాలు దక్కాయని విమర్శించారు. నీళ్లు, నిధు లు, నియామకాలపై హామీ ఇచ్చిన కేసీఆర్‌.. అవినీతి, మోసం, కుటుంబ పాలన ఇచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరందిస్తామని ప్రకటించారు.. కానీ లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇచ్చారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 40 వేల కోట్లు కాగా లక్షా 20వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు.. అయినా అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. అవినీతికి, రాష్ట్ర ప్రజలను మోసం చేశారనడానికి ఈ ప్రాజెక్టే ఉదాహరణ అని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాశ్‌ జావడేకర్‌ మీడియా సమావేశంలో సోమవారం మాట్లాడారు. బీజేపీలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని అంటూ ఎంతమంది చేరుతారో ఈ నెల 27న అందరూ చూస్తారని చెప్పారు.

Updated Date - 2023-08-22T04:37:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising