నల్ల బెలూన్‌లు వదిలి యూత్ కాంగ్రెస్ నిరసన
ABN, First Publish Date - 2023-01-11T00:33:56+05:30
తంగళ్లపల్లి మండల కేంద్ర ంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు నల్ల బెలూన్లు వదులి నిరసన చేపట్టడంతో పోలీసులు హైరనా పడ్డారు
తంగళ్లపల్లి, జనవరి 10: తంగళ్లపల్లి మండల కేంద్ర ంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు నల్ల బెలూన్లు వదులి నిరసన చేపట్టడంతో పోలీసులు హైరనా పడ్డారు.కొద్ది నిమిషాల్లో మంత్రి కేటీఆర్ చేరుకోనుండగా ఒక్కసారిగి యూత్ కాంగ్రెస్ నాయకులు భవనంపై నల్ల బెలూ న్లను వదులుతూ నిరసనకు దిగారు. విగ్రహం నెలకొ ల్పిన ప్రాంతంలోని భవనం మొదటి అంతస్తులో కాంగ్రెస్ కార్యాలయం ఉంది. మంత్రి పర్యటన నేపఽథ్యం లో పోలీసులు ఉదయం కాంగ్రెస్ నాయకులు జల్గం ప్రవీణ్, గుగ్గిళ్ల శ్రీకాంత్, గడ్డం మధుకర్‌తోపాటు పది మంది నాయ కులను అదుపులోకి తీసుకున్నారు. పోలీ సుల కళ్లుగప్పిన యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చుక్క శేఖర్‌తోపాటు అంకారపు మధు కాంగ్రెస్ కార్యాలయంలోకి దూరి తాళం వేసుకున్నారు. మంత్రి కేటీఆర్ రాగానే నిరసన వ్యక్తం చేయుడానికి నల్లా బెలూన్‌లను ఏర్పాటు చేసుకున్నారు. బందోవస్తులో ఉన్న కానిస్టేబుల్‌కు అనుమానం రావడంతో ఉన్నతాధి కారులకు సమాచారం అందించారు. జాలీ గేట్‌పై నుంచి పోలీసులు కార్యాలయంలోకి వెళ్లి తాళాలు పగలగొట్టి పైఅంతస్తులో నిరసన తెలుపుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ అక్కడికి చేరుకోవడంతో పోలీసులు ఉపిరి పీల్చుకు న్నారు. హస్టళ్లలో పౌష్టికాహారాన్ని అందించాలని, మండల కేంద్రంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
Updated Date - 2023-01-11T00:34:04+05:30 IST