మహనీయుల ఆశయ సాధనకు కృషి
ABN, First Publish Date - 2023-03-05T00:43:02+05:30
మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు.
పెద్దపల్లిటౌన్, మార్చి 4 : మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు. ఎనిమి దవ వార్డు కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మీ ప్రజా సం ఘా జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రజిడెంట్ సురేందర్ సన్నీ ఆద్వర్యంలో జెండా చౌర స్తాలో ఏర్పాటుచేసిన మా న్యశ్రీ కాన్షీరాం విగ్రహాన్ని కాన్షీరాం సోదరి స్వర్‌న్‌కౌర్ ఆవిష్కరించారు. ముఖ్యాతి థిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న తరాలకు మహానీయుల జీవిత త్యాగాలు, ఆశయా లను తెలియజేయలన్నారు. వారు చూపిన బాట, ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముంద కు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం మాట్లాడుతూ అంబే ద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ద్వారా హ క్కులు పొందుతున్నారన్నారు. ఆయన ఆలోచన వి ధానం వల్లే చిన్న రాష్ర్టాలు ఏర్పడ్డాయన్నాయన్నా రు. కాన్షీరాం సోదరి మాట్లాడుతూ ఉత్తర భారత దేశంలో ఇదే తొలి విగ్రహమని ఏర్పాటు చేసిన బొంకూరి భాగ్యలక్ష్మీ, బొంకూరి సురేందర్ సన్నీల ను అభినందించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మమ తారెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, బొంకూరి సుధర్శన్, చిరుమిల్ల రాకేష్, బొంకూరి శంకర్, వేముల రాం మూర్తి, బుషనవేన రమేష్‌గౌడ్, తాడూరి శ్రీమాన్, గాండ్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T00:43:02+05:30 IST