బాలికా సాధికారతకు కృషి
ABN, First Publish Date - 2023-01-18T00:07:47+05:30
బాలికా సాధికారతకు ఎన్టీపీసీ యాజమాన్యం కృషి చే స్తున్నదని ఈడీ సునీల్‌కుమార్ పేర్కొన్నారు.
జ్యోతినగర్, జనవరి 17 : బాలికా సాధికారతకు ఎన్టీపీసీ యాజమాన్యం కృషి చే స్తున్నదని ఈడీ సునీల్‌కుమార్ పేర్కొన్నారు. వారం రోజులపాటు ఎన్టీపీసీ సీఎస్ ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికా సాధికారత మిషన్(జెమ్) వర్క్‌షాప్‌ను ఈ డీసీలో సీజీఎం మంగళవారం ప్రారంభించారు. గత వేసవిలో నిర్వహించిన జెమ్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న 120 మంది బాలికలకు వారం రోజులపాటు ప్రత్యేక శిక్షణనివ్వనున్నారు. ఈ సందర్భంగా ఈడీ సునీల్‌కుమార్ మాట్లాడుతూ బాలికల లో చదువుపై ఆసక్తి పెంచడంతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు జెమ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందుతున్న ప్రభుత్వ పాఠశాలల బాలికలకు ట్రాక్ సూట్లు, స్టడీ, స్టేషనరీ వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏజీఎం హెచ్‌ఆర్ విజయలక్ష్మి, అధికారుల సంఘం కార్యదర్వి సోమ్లా భూక్యా, అధికారులు, బాలికలు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-18T00:07:55+05:30 IST