ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధిలో మహిళా సంఘాలు ఆదర్శం

ABN, First Publish Date - 2023-05-27T00:05:03+05:30

మహిళా సంఘాలు దినదినం అభివృద్ధి చెందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాయని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లంతకుంట, మే 26: మహిళా సంఘాలు దినదినం అభివృద్ధి చెందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాయని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలకేంద్రంలో ఆదర్శ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ పరికరాలను అందుబాటు ధరలో ఉంచాలన్నారు. మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు పోటీపడుతున్నాయన్నారు. తొలిపొద్దు కార్యక్రమంలో భాగంగా రేపాక, సోమారంపేట, వెంకట్రావుపల్లె, గొల్లపల్లి, తిప్పాపూర్‌, అనంతగిరి, ఇల్లంతకుంట, పత్తికుంటపల్లె, తాళ్లపెల్లి, గాలిపెల్లి, నర్సక్కపేట, జవారిపేటలో ఇంటింటికి వెళ్లి రూ.33లక్షల కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ప్రభుత్వం ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని, నిరుపేద తల్లిదండ్రులకు అండగా నిలుస్తోందని అన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సంజీవ్‌, రైతుబంధు అధ్యక్షుడు రాజిరెడ్డి, సెస్‌డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి, సర్పంచులు రొండ్ల లక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి, మంద సుశీల, దమ్మని లక్ష్మి, భాగ్యలక్ష్మి, శ్రీలత, పద్మ, వాణిదేవేందర్‌రెడ్డి, శిరీష, ఎంపీటీసీలు పుష్పలత, ఒగ్గు నర్సయ్య, సావనపెల్లి వనజ, శ్యామలాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising