ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే మహిళా బిల్లు
ABN, First Publish Date - 2023-09-22T00:15:17+05:30
నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కవిత పోరాట ఫలితంగానే మహిళా బిల్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్, కోరుట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ కలకుంట్ల విద్యాసాగర్‌రావులు అన్నారు.
జగిత్యాల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కవిత పోరాట ఫలితంగానే మహిళా బిల్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్, కోరుట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ కలకుంట్ల విద్యాసాగర్‌రావులు అన్నారు. ఇటీవల ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత ఉద్యమ ఫలితంగా కేంద్రం మహిళా బిల్లును పార్లమెం ట్‌లో ఆమోదింపజేసిందని పేర్కొంటూ గురువారం పట్టణంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. బాణాసంచా పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 33 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మహిళా బిల్లు కొరకు ప్రయత్నించినా దక్కని ఫలితం 46 పార్టీలను ఏకం చేసి ప్రస్తుతం కవిత పోరాటంతో ఫలించిందన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లును స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. కవిత పోరాటంతో కేవలం తెలంగాణ రాష్ట్ర మహిళలే కాకుండా యావత్ దేశంలోని మహిళా లోకానికి రాజకీయ అవకాశాలు చేజిక్కనున్నాయ న్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పే కల్లాబొల్లి కబుర్లు, నెరవేర్చని హామీలు ప్రజలు నమ్మడం లేదన్నారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృషించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి నాయకు లు, మహిళా విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T00:15:17+05:30 IST