ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉపాధి బిల్లులు రాక అవస్థలు పడుతున్నాం

ABN, First Publish Date - 2023-06-26T00:24:38+05:30

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీలో చేసిన పనులకు కూలి డబ్బులు రాక అవస్థలు పడుతున్నామని ఉపాధి కూలీలు అధికారులపై మండిపడ్డారు. వీర్నపల్లి మండలంలోని స్థానిక గ్రామ పంచా యతీలో ఉపాధి హామీ సామాజిక తనిఖీల్లో భాగంగా సర్పంచ్‌ పాటి దినకర్‌ అధ్యక్షతన ఆదివారం గ్రామసభ ఏర్పాటు చేశారు.

గ్రామసభకు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీర్నపల్లి, జూన్‌ 25: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీలో చేసిన పనులకు కూలి డబ్బులు రాక అవస్థలు పడుతున్నామని ఉపాధి కూలీలు అధికారులపై మండిపడ్డారు. వీర్నపల్లి మండలంలోని స్థానిక గ్రామ పంచా యతీలో ఉపాధి హామీ సామాజిక తనిఖీల్లో భాగంగా సర్పంచ్‌ పాటి దినకర్‌ అధ్యక్షతన ఆదివారం గ్రామసభ ఏర్పాటు చేశారు. సభలో సంవత్సర కాలం పాటు జరిగిన పనుల జాబితాను ఉపాధిహామీ సోషల్‌ ఆడిట్‌ రిసోర్స్‌ పర్సన్‌ అశోక్‌ చదివి వినిపించారు. పనులకు సంబంధించి, బిల్లులకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఆయన కోరారు. ఉపాధి కూలీలు చేసిన పని డబ్బులు ఏ బ్యాంకుల్లో పడుతున్నాయో అయోమయంలో ఉన్నామని పేర్కొన్నారు. ఇంకుడు గుంతలకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు రాలేదన్నారు. మండలంలో సరిపడు ఉపాధి సిబ్బంది లేక జాబ్‌కార్డు జారీలు, మస్టర్‌లు అందించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. మండలంలో సరిపడు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉపాధి కూలీల సమస్యలు తీర్చాలన్నారు. అనంతరం సామాజిక తనిఖీ సిబ్బంది మాట్లాడుతూ పని జరిగిన ప్రదేశంలో ఉపాధిహామీకి సంబంధించిన బోర్డులను పెట్టాలన్నారు. బృహత్‌పల్లెలో మొక్కలు నాటడం జరిగింది కానీ కంచె బిగించలేదని తెలిపారు. పని ప్రదేశంలో ప్రతిరోజు రోల్‌ కాల్స్‌ చేయాలన్నారు. బిల్లులు రాని వారికి వెంటనే బిల్లులు చెల్లించేలా అధికారులకు నివేదిక అందజేస్తామ ని కూలీలకు సూచించారు. ఈ సభలో ఎంపీపీ మాలోతు భూల, సెస్‌ డైరెక్టర్‌ మాడుగుల మల్లేశం, ఉపసర్పంచ్‌ బోయిని రవి, ఎంపీటీసీ అరుణ్‌ కుమార్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఉస్మాన్‌, పంచాయతీ కార్యదర్శి పురు షోత్తం, ఉపాధిహామీ సాంకేతిక సహాయకులు నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:24:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising