ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ.. దడ

ABN, First Publish Date - 2023-05-14T00:38:02+05:30

ఎండలు, వడగాల్పులు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో వారం రోజుల క్రితం వరకు వాతావరణం కొంత చల్లగా ఉంది. రెండు రోజుల నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి.

నిర్మానుష్యంగా సిరిసిల్ల మార్కెట్‌ ఏరియా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నేడు, రేపు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

- పగటి వేళల్లో నిర్మానుష్యంగా రద్దీ ప్రదేశాలు

- ఉక్కపోతతో ఇంట్లో నుంచి కదలని జిల్లా వాసులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఎండలు, వడగాల్పులు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో వారం రోజుల క్రితం వరకు వాతావరణం కొంత చల్లగా ఉంది. రెండు రోజుల నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. భగభగ మండే ఎండలను చూసి జనం ఇంట్లో నుంచి రావడానికి జంకుతున్నారు. అవసరం మేరకే బయటకు వస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఉక్కపోత జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలతోపాటు రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.5 డిగ్రీలు నమోదుకాగా కనిష్ఠ ఉష్ణోగ్రత 21.2 డిగ్రీలుగా నమోదైంది. మరో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆదివారం 44 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది.

నిర్మానుష్యంగా రోడ్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎప్పుడూ రద్దీగా ఉంటే మార్కెట్‌ ఏరియా, పెద్దబజార్‌, పాతబస్టాండ్‌, గాంధీచౌక్‌, అంబేద్కర్‌ చౌరస్తా, వెంకంపేట రోడ్‌, గోపాల్‌నగర్‌, కొత్త బస్టాండ్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు భయపడి జనాలు కనిపించడం లేదు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. 11 గంటల వరకే జనాలు ఇళ్లలోకి చేరుకుంటున్నారు. మళ్లీ సాయంత్రం 6 గంటల వరకు ఎవరూ బయటకు రావడం లేదు. ఎండ తీవ్రత పెరుగుతుండడంతో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తలకు రక్షణగా గొడుగు, రుమాలు, తెల్లని టోపీ ధరించాలని, నీరు ఎక్కువగా తాగాలని, మాంసం, మద్యానికి దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు.

Updated Date - 2023-05-14T00:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising