ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిరుపేదలకు ఉపయోగకరంగా.. డయాగ్నోస్టిక్స్‌ సేవలు

ABN, First Publish Date - 2023-09-04T01:01:44+05:30

తెలంగాణ సర్కారు అందుబా టులోకి తెచ్చిన అధునాత డయాగ్నిస్టిక్‌ కేంద్రం నిరుపేద రోగుల పాలిట సంజీవనిలా మారాయి.

ఆగస్టులో రికార్డు స్థాయిలో రోగ నిర్ధారణ పరీక్షలు

ఒక్క నెలలోనే 27 వేలకు పైగా ల్యాబ్‌ టెస్టులు

జగిత్యాల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సర్కారు అందుబా టులోకి తెచ్చిన అధునాత డయాగ్నిస్టిక్‌ కేంద్రం నిరుపేద రోగుల పాలిట సంజీవనిలా మారాయి. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబాల రోగు లకు ఖరీదైన రోగ నిర్ధారణ రిపోర్టులను ఉచితంగా అందిస్తోంది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రం సత్పలితాలను అందిస్తోంది. నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య పరీక్ష ఫలితాలను ఇస్తోంది. హైద్రాబాద్‌లో పెద్ద ఆసుపత్రులు, ల్యాబ్‌ సెంటర్లే కాకుండా జిల్లా కేంద్రం వంటి ప్రాంతాలలో సైతం రోగులను మెరుగైన వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తూ శభాష్‌ అనిపించుకుంటోంది.

రెండేళ్లుగా డయాగ్నోస్టిక్‌ కేంద్రం సేవలు..

జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ క్యాంపులో రెండేళ్ల క్రితం డయాగ్నోస్టిక్‌ కేం ద్రాన్ని ఏర్పాటు చేశారు. 2021 మే 7వ తేదిన జగిత్యాల ఎమ్మెల్యే డా క్టర్‌ సంజయ్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌లు రూ. 3 కోట్లతో నిర్మించిన డయాగ్నొస్టిక్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. పైసా ఖర్చు లేకుండా ల్యాబ్‌ పరీక్షలు నిర్వహించి ఫలితాలను అందిస్తున్నారు. అత్యా ధునిక టెక్నాలజీతో తయారు చేసిన మిషనరీలతో ఏర్పాటు చేసిన ల్యాబ్‌ ద్వారా వేల సంఖ్యలో రోగులకు ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కేంద్రం ఏర్పాటుతో ప్రజలకు ఆర్థిక భారం తగ్గింది. నాణ్యమైన, సూపర్‌ స్పెషాలిటీ రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

83 రకాల రోగాలకు నిర్ధారణ పరీక్షలు..

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల 35 పీహెచ్‌సీ, అర్బన్‌ హెల్త్‌ సెంట ర్లు, సీహెచ్‌సీలు, జగిత్యాల మాతా శిశు కేంద్రాలను అనుసందానం చేశా రు. జగిత్యాల డయాగ్నోస్టిక్‌ హబ్‌లో 8 మంది ల్యాబ్‌ టెక్నిషియన్‌లతో పా టు ల్యాబ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ల్యాబ్‌ మేనేజర్‌, ల్యాబ్‌ ఇన్‌చార్జిలు పని చేస్తున్నారు. పది అత్యాధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన కేంద్రంలో ప రీక్షలు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. జగిత్యాలలో 134 వివిధ రకాల రో గ నిర్ధారణ పరీక్షలు చేసే సామర్థ్యం గల యంత్ర పరికరాలున్నాయి. ప్ర స్తుతం 83 రకాల వివిధ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధ్య మైనంత తొందరలో 134 రోగాలకు నిర్ధారణ పరీక్షలు చేసే విధంగా వైద్యా ధికారులు ముందుకు వెళ్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ను ప్రారంభి స్తారు. 35 పీహెచ్‌సీ, సీహెచ్‌సీల నుంచి ఆన్‌లైన్‌లో ఎన్రోల్‌మెంట్‌ చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల వర కు రక్త నమూనాలను తెప్పించుకుంటున్నారు. శాంపిల్స్‌ నోట్‌ చేసిన అనంతరం సుమారు రెండు, మూడు గంటల్లో శాంపిల్స్‌తో పరీక్షలు పూర్తి చేస్తు న్నారు. తదుపరి ఆన్‌లైన్‌లో రోగ నిర్ధారణ పరీక్ష ఫలితాలను అందిస్తున్నారు.

అత్యంత ఖరీదైన రోగాలకూ..

అత్యంత ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలు డయాగ్నొస్టిక్‌ కేంద్రంలో నిర్వహి స్తున్నారు. క్వాలిఫైడ్‌ ల్యాబ్‌ టెక్నిషియన్‌లను నియామకం చేసుకో వడంతో పాటు ఉద్యోగులు, సిబ్బందికి సుమారు మూడు నెలల ప్రత్యేక శిక్షణను అందించిన ఉద్యోగులతో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ల్యాబ్‌ టెస్టింగ్‌ నుంచి గుర్తింపు పొందింది. జగిత్యాల కేంద్రం లో రోగులకు రక్త నమూనా, ఇతర రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడా నికి ప్రత్యేక కార్యాచరణతో వైద్యాధికారులు ముందుకు వెళ్తున్నారు. మా రుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పీహెచ్‌సీ, సీహె చ్‌సీల కేంద్రాలకు వచ్చిన రోగులను రక్త నమూనాలను సేకరిస్తారు. ప్రత్యేక వాహనాల్లో రక్త నమూనాలను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్‌ కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులు నిర్ధారించిన అనంతరం ఫలితాలను వెల్లడిస్తున్నారు. రక్త నమూనాను సేకరించిన తొలి 12 గంటల్లోపు రిపోర్టులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. నేరుగా రోగి సెల్‌ఫో న్‌లకు రోగ నిర్ధారణ పరీక్ష ఫలితాలను పంపుతున్నారు. సంబంధిత పీహెచ్‌సీ లు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ల్యాబ్‌ పరీక్షలకు సంబందించిన ప్రింట్‌ తీసుకునే విధంగా సౌకర్యం కల్పించారు.

ఆగస్టులో రికార్డు స్థాయిలో పరీక్షలు..

జిల్లా కేంద్రంలోని డయాగ్నొస్టిక్‌ హబ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 2023 ఆగస్టులో రికార్డు స్థాయిలో రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు. కేంద్రంలో డయాబెటిక్‌ ఫ్రొఫైల్‌ ఎఫ్‌బీఎస్‌, పీఎల్‌బీఎస్‌, ఆర్‌బీఎస్‌ టెస్టులు, థైరాయిడ్‌, లి వర్‌ పనితీరు, రెనాల్‌ పనితీరు, యూపిడ్‌ ఫ్రొఫైల్‌, కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ (సీబీ పీ), బీపీ, లెప్రసీ, క్యాన్సర్‌, హనీమియా, మైక్రో బయాలోజి పరీక్షలు నిర్వహి స్తున్నారు. ఆగస్టులో జిల్లాలోని వివిధ పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఎంసీహెచ్‌ల ద్వారా 12,612 మంది రోగులకు సంబంధించిన 27,404 రక్త నమూనాలను సేకరించా రు. ఇందులో అత్యధికంగా జిల్లా ఆసుపత్రి నుంచి 5,215, మాతా శిశు కేంద్రం నుంచి 3,209 రక్త నమూనాలను సేకరించి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించా రు. అదేవిధంగా అత్యల్పంగా అజీపుర మున్సిపల్‌ బిల్డింగ్‌లో పీహెచ్‌సీ నుంచి 248, ఇస్లాంపుర పీహెచ్‌సీ నుంచి 249 రక్త నమూనాలను సేకరించి రోగ నిర్ధార ణ పరీక్షలు జరిపారు. గతంలో రోజుకు సగటున 1700 నుంచి 2000 మద్య రోగ నిర్ధారణ పరీక్షలు జరగగా గడిచిన నెలలో 2,700కు పైగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి రికార్డు సృష్టించారు.

సేవలను మరింత విస్తృత పరుస్తాం

- డాక్టర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు జగిత్యాల డయాగ్నొస్టిక్‌ హబ్‌లో సేవలను మ రింత విస్తృత పరుస్తాము. రానున్న రోజుల్లో 134 వివిధ రోగాలకు ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే విధంగా ముందుకు వెళ్తున్నాము. ప్రతీ నిత్యం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని రోగులకు వేగవంతంగా రోగ నిర్ధారణ పరీక్ష ఫలితాలను అందిస్తున్నాము.

పైసా ఖర్చు లేకుండా రోగ నిర్ధారణ ఫలితాలు

- డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన సరళి మేరకు జగిత్యాలలో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్‌ హబ్‌ ద్వారా నిరుపేద రోగులకు పైసా ఖర్చు లేకుండా అత్యంత ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్ష ఫలితాలను అందిస్తున్నాము. రోగులు ఎక్కడికి వెళ్లనవసరం లేకుండా నేరుగా వారు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న సెల్‌ఫోన్‌ నంబర్లకు ఫలితాలు పంపుతున్నాము.

Updated Date - 2023-09-04T01:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising