ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి : ఎస్పీ

ABN, First Publish Date - 2023-06-11T00:23:54+05:30

వాహనదారులు ట్రాఫి క్‌ నిబంధనలు విధిగా పాటించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ నిబం ధనలపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ద్వి చక్రవాహన ర్యాలీని శనివారం సిరిసిల్ల పట్టణం లోని బతుకమ్మఘాట్‌ వద్ద ప్రారంభించారు.

ద్వి చక్రవాహన ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల క్రైం, జూన్‌ 10: వాహనదారులు ట్రాఫి క్‌ నిబంధనలు విధిగా పాటించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ నిబం ధనలపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ద్వి చక్రవాహన ర్యాలీని శనివారం సిరిసిల్ల పట్టణం లోని బతుకమ్మఘాట్‌ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రధానంగా డ్రంకెన్‌డ్రైవ్‌, సీట్‌ బెల్ట్‌, హెల్మెట్‌, రాంగ్‌ రూట్‌, సిగ్నల్‌ జంప్‌, ట్రిపుల్‌ రైడ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవ్‌ వంటి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్ర వాహన ర్యాలీ గాంఽధీచౌక్‌, అంబేద్కర్‌చౌరస్తా, గోపాల్‌నగర్‌, కొత్త బస్టాండ్‌మీదుగా నేతన్న చౌక్‌ వరకు కొనసాగింది. కార్యక్రమంలో డీఎస్పీ రవికుమార్‌, సీఐలు అనిల్‌కుమార్‌, ఉపేందర్‌, మొగిలి, ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట: ప్రజల భద్రత లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని సీఐ మొగిలి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మొగిలి మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాల్నారు. ఇన్‌చార్జి ఎస్‌హెచ్‌వో, హెడ్‌కానిస్టేబుల్‌ ఖాజా మజార్‌పాషా, సిబ్బంది పాల్గొన్నారు.

తంగళ్లపల్లి : రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సీఐ ఉపేందర్‌ సూచించారు. శనివారం సాయంత్రం తంగళ్లపల్లి మండల కేంద్రంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్‌ ధరించి వాహనాలు నడుపుతున్న వారికి గులాబీ పూలు అందించారు. ఎస్సై లక్ష్మారెడ్డి, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

ముస్తాబాద్‌: ముస్తాబాద్‌ మండల కేంద్రంలో ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రోడ్డుభద్రతా నియమాలపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీసీలు ఖాసీం, రాజశేఖర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

వీర్నపల్లి: ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నియమాలు ప్రజలందరూ పాటించాలని ఎస్సై నవత అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రోడ్డు సేఫ్టీ అవేర్‌నెన్‌ కార్యక్రమంలో భాగంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రతి వాహనదారుడు విధిగా హెల్మెట్‌ ధరించాలన్నారు.

చందుర్తి : ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ ధరించాలని చందుర్తి ఎస్సై రమేష్‌ వాహనదారులకు సూచించారు. చందుర్తి మండల కేంద్రంలో హెల్మెట్‌ ధరించాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. చందుర్తి తిమ్మాపూర్‌, మల్యాల గ్రామాల యువకులు పాల్గొన్నారు.

రుద్రంగి: వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్సై ప్రభాకర్‌ అన్నారు. తెలం గాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని సూచించారు. వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు.

Updated Date - 2023-06-11T00:23:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising