పోచమ్మ తల్లి దీవెనలతో రాష్ట్రం సుభిక్షం
ABN, First Publish Date - 2023-06-26T01:04:11+05:30
గ్రామ దేవత పోచమ్మ తల్లి దీవెనలతో పల్లెల న్నీ అభివృద్ధి సాధించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని లింగాపూర్‌లో ఆదివారం ని ర్వహించిన పోచమ్మ బోనాల పండుగ ఉత్సవాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్
పెగడపల్లి, జూన్ 25 : గ్రామ దేవత పోచమ్మ తల్లి దీవెనలతో పల్లెల న్నీ అభివృద్ధి సాధించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని లింగాపూర్‌లో ఆదివారం ని ర్వహించిన పోచమ్మ బోనాల పండుగ ఉత్సవాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో కలసి పో చమ్మ బోనం ఎత్తుకుని ర్యాలీలో పాల్గొని మహిళలల్లో ఉత్సాహాన్ని నింపా రు. అంతకుముందు గ్రామంలో రూ. 15 లక్షలతో నిర్మించనున్న కమ్యూ నిటీ భవన నిర్మాణాలకు మంత్రి భూమిపూజ చేసి శంఖుస్థాపన చేశారు. కార్యక్రమాలలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు, ఎంపీపీ శోభాసురెం దర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు సింగిల్‌విండో చైర్మన్ రమణా రావు, మంత్రి వేణుగోపాల్, భాస్కర్‌రెడ్డి, మార్కెట్ చైర్‌పర్సన్ నిర్మల మ ల్లారెడ్డి, సర్పంచ్ శంకర్ పాల్గొన్నారు
Updated Date - 2023-06-26T01:04:11+05:30 IST