ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రజల బ్రతుకులు మారలేదు

ABN, First Publish Date - 2023-06-03T00:41:54+05:30

ఆత్మబలిదానాలు, సకల జనుల పోరాటా లు, త్యాగాల ఫలితగాఆ ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అయినా ప్రజల బ్రతుకులు మారలేదనిసీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవీ చలపతిరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణ్‌నగర్‌, జూన్‌ 2: ఆత్మబలిదానాలు, సకల జనుల పోరాటా లు, త్యాగాల ఫలితగాఆ ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అయినా ప్రజల బ్రతుకులు మారలేదనిసీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవీ చలపతిరావు అన్నారు. శుక్రవారం గోదావరిఖని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఏర్పాటు చేసిన నిరసన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పాలకుల విధానాలే నేడు కొనసాగుతున్నాయని, కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ లు ఒక్కటి కూడా అమలు కాలేదని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, గిరిజనులకు, ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్‌, మండలానికో వందపడకల ఆసుపత్రి నిర్మాణం, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికు లను పర్మినెంట్‌ చేస్తామని హామి ఇచ్చినా ఒక్క హామి కూడా నెరవేరలేదన్నారు. పేదల కష్టాలు, కన్నీళ్లు తుడవడంతో విఫలమైందని, తెలంగాణ కోసం బలిదానాలు చేసిన కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని, కేసీఆర్‌ కుటుంబం మాత్రం విలాసవంతంగా జీవితాలు గడుపుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకులు రాజన్న, నరేష్‌, ఐ కృష్ణ, వెంకన్న, అశోక్‌, జ్యో తి, శంకర్‌, బుచ్చమ్మ, రమేష్‌, చంద్రయ్య, రాంకీ, శ్రీకాంత్‌, సుధాకర్‌, సాంబయ్య, కళ్యాణి, పద్మ, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising