ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి

ABN, First Publish Date - 2023-03-02T00:38:48+05:30

ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట కమ్యూనీటి ఆరోగ్య కేంద్రంలో అదనపు భవన నిర్మాణం కోసం కొండూరు రవీందర్‌రావు బుధవారం భూమిపూజ చేశారు.

అదనపు భవన నిర్మాణం కోసం భూమిపూజ చేస్తున్న కొండూరు రవీందర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు

గంభీరావుపేట, మార్చి 1: ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట కమ్యూనీటి ఆరోగ్య కేంద్రంలో అదనపు భవన నిర్మాణం కోసం కొండూరు రవీందర్‌రావు బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ, నూతన ఆసుపత్రుల నిర్మాణం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. సామాన్యుడికి సైతం ఖరీదైన వైద్య సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన అన్ని వసతులతో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో టిమ్స్‌ ఆసుపత్రిని నిర్మించగా, హైదరాబాద్‌ చుట్టూ నలువైపులా వెయ్యి పడకలతో కూడిన నాలుగు ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. వరంగల్‌ 20 అంతస్తులతో అధునాతన సౌకర్యాలతో ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తోందని గుర్తు చేశారు. ప్రధానంగా విద్య, వైద్యంపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో బాగంగా హెల్త్‌ ప్రొఫైల్‌ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. తద్వారా వచ్చే హెల్త్‌ కార్డు అత్యవసర పరిస్థితిలో ప్రతీఒక్కరికి తొందరగా ట్రీట్‌మెంట్‌ జరిగే వీలుంటుందన్నారు. అదే విధంగా ఇటీవల కంటి వెలుగు కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు నిర్వహించి, అవసరం ఉన్న వారికి కళ్లఅద్దాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కటకం శ్రీధర్‌, ఎంపీపీ వంగ కరుణాసురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయలక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, సెస్‌ డైరెక్టర్‌ గౌరినేని నారాయణరావు, వైస్‌ఎంపీపీ దోసల లతరాజు, కోళ్లమద్ది, నర్మాల సర్పంచ్‌లు కేశవరావు, రాజు, ఎంపీటీసీ రాజేందర్‌, ఉపసర్పంచ్‌ నాగరాజు, రైతుబంధుసమితి చైర్మన్‌ రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!