ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో నిరసన

ABN, First Publish Date - 2023-06-03T00:36:39+05:30

రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరైన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతిని ధులకు మంథనిలో రైతుల నుంచి శుక్రవారం నిరసన ఎదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంథని, జూన్‌ 2: రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరైన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతిని ధులకు మంథనిలో రైతుల నుంచి శుక్రవారం నిరసన ఎదురైంది. స్థానిక వ్యవసా య మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోళ్ల విషయంలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను యార్డు మెయిన్‌ గేట్‌ వేసి కాసేపు అడ్డుకున్నారు. రోజుల తరబడి తాము ఇక్కడే ఉంటున్న తమ ధాన్యాన్ని కాంటా పెట్టడం లేదని, రేకుల షెడ్ల కింద పోసుకున్న పలుకుబడి ఉన్న రైతుల ధాన్యాన్ని మాత్రం వెంటవెంటనే కాంటాలు పెడుతు న్నారని చెప్పారు. అయినా నిర్లక్ష్యంగా లోనికి వెళ్లిన ఏఎంసీ, పీఏసీఎస్‌ చైర్మన్లు ఎక్కేటి అనంతరెడ్డి, కొత్త శ్రీనివాస్‌, ఎంపీపీ కొండ శంకర్‌, జడ్పీటీసీ తగరం సుమ లత, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు యార్డులో జెండా అవిష్కరణ ముగించుకొని తిరిగి గేట్‌ వద్దకు రాగా అప్పటికే రైతులు గేట్‌ మూసివేసి అడ్డుకున్నారు. కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తర్వాత త్వరగా కాంటాలు పెట్టిస్తామని వారు హామీ ఇవ్వ డంతో రైతులు గేట్‌ ఓపెన్‌ చేశారు.

Updated Date - 2023-06-03T00:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising