ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండగట్టుకు నీటి తరలింపు ప్రతిపాదనలు

ABN, First Publish Date - 2023-02-21T00:18:45+05:30

కొండగట్టు అంజనేయస్వామి దేవస్థానం పరిధిలోకి నీటి తరలింపుపై జలవనరుల శాఖ అధికారులు సోమవారం వరదకాలువ, సంతోళ్లలొద్ది తదితర ప్రదేశాలను పరిశీలించారు.

చెరువు వద్ద పరిశీలిస్తున్న ఇంజనీరింగ్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ రెండు చోట్ల నుంచి తరలింపునకు సర్వే

ౖఫ పరిశీలించిన ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌

మల్యాల, ఫిబ్రవరి 20: కొండగట్టు అంజనేయస్వామి దేవస్థానం పరిధిలోకి నీటి తరలింపుపై జలవనరుల శాఖ అధికారులు సోమవారం వరదకాలువ, సంతోళ్లలొద్ది తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ మే రకు చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులు, ప్రజాప్రతిని ధులతో కలిసి ఆయా ప్రదేశాల్లో తరలింపునకు అవసరమైన అవకాశా లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెల 15న కొండగట్టు సీఎం కేసీఆర్‌ వచ్చిన సందర్భంలో కొండపైన నీటి కొరత లేకుండా పుష్కలం గా నీరందించడానికి కాళేశ్వరం జలాలను అందించాలనే ఆదేశాల మేర కు సీఈ సుధాకర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులు సర్వే బృందాలతో సోమవారం పలు చోట్ల నుంచి సర్వే చేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పం పించారు. వరద కాలువ నుంచి సంతోళ్లలొద్ది మరొకటి వరదకాలువ నుంచి దిగువ కొండగట్టు స్టేజి సమీపంలో గల తుమ్మల చెరువుకు నీటి ని తరలించే ప్రతిపాదనలు చూశారు. సంతోళ్లలొద్ది, తుమ్మల చెరువు నుంచి మిషన్‌ భగీరథ ద్వారా నీటిని కొండపైకి తరలించేందుకు అధికా రులు ప్రతిపాదనలు పంపగా రెండింటినీ పరిశీలించారు. అయితే సంతో ళ్లలోద్దిని రిజర్వాయర్‌గా మార్చడం అక్కడికి వరదకాలువ నీటిని తర లించడానికి గాను ఎలాంటి ఇబ్బందులు కానీ భూసేకరణ అవసరం పడే అవకాశాలు లేకపోవడంతో కొండపైకి నీటిని అందించే చర్యల వైపు ఇంజనీరింగ్‌ అధికారులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పరిశీలించి వెళ్లిన సీఈ ఇతర ఇంజనీరింగ్‌ అధికారులు కరీంనగర్‌ ఎల్‌ ఎండీలో దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలోనే నీటి తర లింపుపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. సీఈ వెంట ఎస్‌ఈ అశోక్‌కుమార్‌, ఈఈ సుధాకిరణ్‌, డీఈ తిరుపతి ఏఈఈలు అరుణ్‌కుమార్‌, వెంకటేష్‌, మిషన్‌ భగీరథ జేఈఈ హరిప్రసాద్‌ తదితరులుపాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T00:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising