ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగ కేసులతో కక్ష సాధింపు చర్యలు

ABN, First Publish Date - 2023-04-03T00:17:23+05:30

ఎన్నికలు సమీపిస్తుంటే ప్రభుత్వంలోని కుటు బసభ్యులకు దడ పుడుతుందని, అందుకే దొంగ కేసులతో కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తు న్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు.

తిరుపతి రెడ్డి కుటుంబభ్యులను పరామర్శిస్తున్న ఎంపీ,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎంపీ ధర్మపురి అర్వింద్‌

జగిత్యాల రూరల్‌, ఏప్రిల్‌ 2: ఎన్నికలు సమీపిస్తుంటే ప్రభుత్వంలోని కుటు బసభ్యులకు దడ పుడుతుందని, అందుకే దొంగ కేసులతో కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తు న్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌ గ్రామంలో పర్యటించి రైతు నాయకుడు, బీజేపీ నేత పన్నాల తిరు పతి రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ తిరుపతి రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయడం, ఆ కుటుం బాన్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, నిజామా బాద్‌ మాజీ ఎంపీలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ఇది విచారకరం అన్నా రు. కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి, రైతులకు ఏ విధంగా మేలు జరుగు తుందో అవగాహన పెంచుకొని తిరుపతిరెడ్డి బీజేపీలోకి చేరారన్నారు. రానున్న ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని అర్వింద్‌ భరోసానిచ్చారు. ఈ కార్యక్రమం లో పన్నాల సరిత తిరుపతిరెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు సురతాని భాగ్యలక్ష్మీ, తెలంగాణ ప్రవాస్‌, ఏపీ బీజేపీ స్టేట్‌ సెక్రటరీ జనరల్‌ కామేశ్వరి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రవీణ్‌, అసెంబ్లీ కన్వీనర్‌ మదన్‌మోహన్‌, పట్టణ, మండల అధ్యక్షులు అనిల్‌, నలువాల తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:17:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising