మద్యం టెండర్లకు నోటిఫికేషన్ జారీ
ABN, First Publish Date - 2023-08-05T00:06:08+05:30
జిల్లాలో గల రిటైల్ మద్యం షాపులకు వచ్చే రెండేళ్లకు గాను టెండ ర్లను ఆహ్వానించేందుకు ఎక్సైజ్ శాఖాధికారులు నోటిఫికే షన్ జారీ చేశారు.
పెద్దపల్లి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గల రిటైల్ మద్యం షాపులకు వచ్చే రెండేళ్లకు గాను టెండ ర్లను ఆహ్వానించేందుకు ఎక్సైజ్ శాఖాధికారులు నోటిఫికే షన్ జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్, రమేష్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జిల్లాలో 77 మద్యం షాపులు ఉన్నాయని, గౌడస్తులకు రిజర్వేషన్ ప్రకారం 13 షాపులు, ఎస్సీలకు రిజర్వేషన్ ప్రకారం 8 షాపులు, ఓపెన్ కేటగిరీలో 56 షాపులను కేటా యించామని తెలిపారు. రిజర్వుడు షాపులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమక్షంలో డ్రా తీసి ఎంపిక చేశామన్నారు. గౌడ కులస్తులకు గెజిట్ షాపు నంబర్ 8 పెద్దపల్లి పట్టణంలో, 12 హన్మంతునిపేటలో, 20 ఎలిగేడు మండలం శివపెల్లిలో, 21, 22 షాపులు సుల్తానాబాద్ పట్టణంలో, 40, 49, 52 షాపులు రామగుండం మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలో, 63 కమాన్‌పూర్‌లో, 64, 66, 67 షాపులు మంథని మున్సిపల్ పరిధిలో, షాపు నంబర్ 70 మంథని మండలం గుంజప డుగు రిజర్వు అయ్యిందన్నారు. ఎస్సీలకు గెజిట్ షాపు నంబర్ 6 పెద్దపల్లి పట్టణంలో, 14 ధర్మారంలో, 17 జూలపల్లిలో, 27 కాల్వరాం పూర్‌లో, 44, 55 షాపులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో, 69 కమాన్‌పూర్ మండలం గుండారంలో, 76 ముత్తారంలోని షాపు రిజర్వు అయ్యిందన్నారు. మిగతా గెజిట్ నంబర్ షాపులన్నీ ఓపెన్ కేటగిరీలోకి వస్తాయన్నారు. సెలవు దినాలు మినహా ప్రతిరోజు ఉద యం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తు లను స్వీకరిస్తామని, కౌంటర్లను ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్కో వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు రుసుం 2 లక్షలు ఉంటుందని, ఈ డబ్బులను వాపస్ ఇవ్వరని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 18వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. 6, 13, 15వ తేదీ సెలవు దినాలు కావడంతో ఆ రోజుల్లో దరఖాస్తులను తీసుకోరని చెప్పారు. ఈనెల 21న ఉదయం 11 గంటల నుంచి బంధంపల్లిలోని స్వరూప గార్డెన్‌లో డ్రా ద్వారా టెండర్లను ఖరారు చేస్తామన్నారు. ఆ రోజు నుంచి 22వ తేదీ వరకు లైసెన్సు ఫీజులో 6వ వంతు సొమ్మును చెల్లించాలన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2025 నవంబర్ నెలాఖరు వరకు షాపులను నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఆయ న వివరించారు.
తొలి రోజు నాలుగు దరఖాస్తులు..
మద్యం షాపులకు టెండర్ల నిర్వహణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తొలిరోజే నాలుగు దరఖాస్తులు వచ్చాయని ఈఎస్ మహిపాల్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని షాపులకు 2, మంథని పట్టణంలోని షాపులకు 2 దరఖాస్తులు వచ్చాయని తెలి పారు. ఐటిఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను ఈఎస్ సం దర్శించారు. డీటీఎఫ్ సీఐ రాథోడ్, పెద్దపల్లి, గోదావరిఖని సీఐలు శ్రీనివాస్, రమేష్‌లకు పలు సూచనలు చేశారు. మద్యం వ్యాపారు లు దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు.
Updated Date - 2023-08-05T00:06:08+05:30 IST