ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నో టొబాకో డే అవగాహన ర్యాలీ

ABN, First Publish Date - 2023-06-01T00:34:44+05:30

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో బుధవారం నో టొబాకో డే సందర్భంగా నర్సింగ్‌ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుభాష్‌నగర్‌, మే 31: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో బుధవారం నో టొబాకో డే సందర్భంగా నర్సింగ్‌ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ లలితేదేవి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొప్టా యాక్ట్‌ ప్రకారం పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ ఆఫీసులు, బస్టాండ్‌, పాఠశాలలు, కళాశాలల్లో నిషేధించారని తెలిపారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదన్నారు. పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్‌, పెదవి, గుండె, ఊపిరితిత్తులు, కడుపులో, అల్సర్‌, గొంతు, నాలుక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుజాత, డీఐవో డాక్టర్‌ సాజిదఅతహరి, ఎంసీహెచ్‌ పీవో డాక్టర్‌ వినుత, డెమో రంగారెడ్డి, సూపర్‌వైజర్‌ ఎ శ్రీనివాస్‌, సోషల్‌ వర్కర్‌ రమణాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-01T00:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising